Asani Cyclone Landfall: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను తీరం దాటింది. మచిలీపట్నం-నర్శాపురం మద్య తీరం దాటిన తీవ్ర తుపాను..బలహీనమై తుపానుగా మారింది. అసనీ తుపానుపై తాజా అప్‌డేట్స్ తెలుసుకుందాం..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి..ఐఎండీ అంచనాల్ని తలకిందులు చేస్తూ దిశ మార్చున్న అసని తీవ్ర తుపాను..తుపానుగా బలహీనమై ఏపీలో తీరం దాటింది. రాష్ట్రంలోని మచిలీపట్నం-నరసాపురం మధ్యన కృత్తివెన్ను సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రికి మరింతగా బలహీనమై..రేపటికి వాయుగుండంగా మారనుంది.
ప్రస్తుతం అసనీ తుపాను బంగాళాఖాతంలో ఈశాన్య దిశగా కదులుతోంది. మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, యానాం, కాకినాడ మీదుగా తిరిగి సముద్రంలో ప్రవేశించనుంది. సముద్రంలో ప్రవేశించాక ఇంకాస్త బలహీనమై..అల్పపీడనంగా మారనుంది. తుపాను తీవ్రత తగ్గినా..వాయుగుండమై కదులుతున్న అన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఇంకా రెడ్ అలర్ట్ అలాగే కొనసాగుతోంది. అదే సమయంలో కాకినాడ విశాఖపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కళింగపట్నం, భీమిలి, గంగవరం పోర్టుల్లో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది.
తుపాను బలహీనమైనా..తిరిగి కోస్తా ప్రాంతం నుంచి కదులుతూ సముద్రంలో ప్రవేశించేవరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించిన నేపధ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. మత్స్యకారుల్ని వేటకు వెళ్లవద్దని సూచించారు. అటు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
Also read: Golden Chariot: అసనీ తుపాను ప్రభావం, సముద్రంలో కొట్టుకొచ్చిన బంగారు రధం, ఏ దేశానిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook