CM Kcr Stategy: తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతోందా..? రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి. గత రికార్డును సీఎం కేసీఆర్ బ్రేక్ చేస్తారా..? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..?
వచ్చే ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. రాష్ట్రంలో ముచ్చట మూడోసారి అధికారం చేపట్టాలని వ్యూహాలు రచిస్తున్నారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టి రికార్డు సృష్టించాలని చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త అధ్యయనాన్ని తిరగరాయాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి పవర్లోకి రావడం జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన తర్వాత అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. వరుసగా రెండుసార్లు గెలిచినా..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.
కాంగ్రెస్, టీడీపీ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ గెలిచినా..2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అదే సమయంలో రాష్ట్ర ఆవిర్భావం జరగడంతో రాజకీయ పరిణామాలు మారాయి. అంతకముందు 1995, 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ గెలిచినా..2004 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 2014 జూన్ 2న తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో విజయం ఢంకా మోగించింది. మూడోసారి మళ్లీ అధికారంలో వస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
గత రికార్డులను తిరగరాస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల్లో తమపై విశ్వాసం పెరుగుతోందని..తమకు ప్రత్యామ్నాయం లేదంటున్నారు. రాబోయే ఎన్నికల్లోకూ వంద సీట్లు సాధిస్తామంటున్నారు. 2014, 2018 ఎన్నికల కంటే ఈసారి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. కొత్త పార్టీలు సైతం పుట్టుకొచ్చాయి. ఇటీవల జరిగిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంటుందన్నారు. ఐనా తమను ప్రజలు ఆదరిస్తారని స్పష్టం చేశారు.
ఇప్పటికే పార్టీ ప్లీనరీ నిర్వహించిన సీఎం కేసీఆర్(CM KCR)..పార్టీ నేతలు, శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. దశల వారిగా పార్టీ బలోపేతంపై జిల్లాల నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. ఏదిఏమైనా మూడోసారి అధికారంలోకి రావాలన్న టీఆర్ఎస్ ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
Also read:Tibet Airlines Fire: చైనాలో విమాన ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న విమానం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.