BRIDE DIED AT HER WEDDING : విశాఖ నగర శివారు మధురవాడ నగరంపాలెంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి 7గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఊహించని విధంగా వధువు సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె ప్రాణం కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా పెళ్లి వేడుకల్లో విషాదం నెలకొంది. గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని... కానీ ఇలా ప్రాణం కోల్పోతుందని భావించలేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు సృజన మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు పోలీసులు. సృజన శరీరంలో విష పదార్థం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పోలీసులకు సంబంధిత సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిబంధనల ప్రకారం ఇవాళ సమయం మించిపోయింది. రేపు తిరిగి వైద్యులు ఆస్పత్రికి వచ్చాక పంచనామా జరిగే అవకాశం కనిపిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వధువు విషం తీసుకుందా.. లేక గుండె పోటుతోనే మృతి చెందిందా... లేదా విష ప్రయోగం జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగాక నిర్ఘాంతపోయామని పెళ్లి కూతురు తల్లిదండ్రులు చెప్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే పెళ్లి కుదిరినప్పటి నుంచి వరుడు, వధువు అన్యోన్యంగానే ఉంటున్నారు. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లో వరుడు, వధువు చెట్టాపట్టాలేసుకుని బానే ఉన్నారు. ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. వివాహ వేడుకను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. సంగీత్, మెహందీ, రిసెప్షన్లకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి కొడుకు శివాజీ స్థానికంగా పలుకుబడి ఉన్న రాజకీయ నేత అని తెలుస్తోంది. తెలుగు యువత అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు.
పెళ్లిపీటలపై వధువు మృతి చెదిన ఘటనలో లవ్ స్టోరీ ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ సందర్భంలోనే పెళ్లికూతురు బ్యాగులో గన్నేరు పప్పు గుర్తించామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు మామూలు కడుపు నొప్పి అనుకున్నారని, కానీ పరిస్థితి విషమించి వధువు మృతి చెందిందని పోలీసులు తెలిపారు. సెక్షన్ 174 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెళ్లి తనకు ఇష్టం లేకనే వధువు సృజన గన్నేరు పప్పు తీసుకుందా లేక మరేదైనా ఒత్తిడి కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లికొడుకు ప్రస్తుతం షాక్‌కు గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు.
Also Read - Vijayasai Reddy Review SVP Movie: సర్కారు వారి పాట సినిమాపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి రివ్యూ చూశారా
Also Read - Sarkaru vaari paata collection prediction : కేజీఎఫ్2ను మించిన 'సర్కారు వారి పాట' బుకింగ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook