కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమైనందున తాము రాజీనామా చేస్తున్నామని తెలిపారు వైఎస్సార్సీపీ ఎంపీలు. ఈ మేరకు వారు తమ రాజీనామా పత్రాలను స్పీకరు సుమిత్రా మహాజన్‌కు అందించారు. గతంలో ఈ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ క్రమంలో బడ్జెట్ సెషన్ ఆఖరి రోజుతాము స్పీకరుకి రాజీనామా పత్రాలను సమర్పిస్తామని తెలిపారు. అలా చెప్పిన విధంగా ఈ రోజు స్పీకరును కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. ఈ అంశంపై స్పందిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు మాట్లాడారు. బై ఎలక్షన్లలో మళ్లీ తాము పోటీ చేసి గెలుస్తామని.. మళ్లీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని తెలిపారు.
ఆయన ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు పై కూడా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వారు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని తెలిపారు. 12 సార్లు వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశబెట్టినా.. చర్చకు ఆ అంశం రాలేదని ఆయన తెలిపారు. తమ నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేయడం వల్లే.. చంద్రబాబు వేరే గత్యంతరం లేక బీజేపీ నుండి బయటకు వచ్చారని.. లేకపోతే ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం నేర్పేవారని మరో ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు.
YSRCP Lok Sabha MPs submitted their resignations to Speaker Sumitra Mahajan. #SpecialStatus #AndhraPradesh pic.twitter.com/M8F9pWfSu0
— ANI (@ANI) April 6, 2018