Zomato పుడ్ డెలివరీలో వెనకబడిపోతున్న జొమాటో

Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 03:50 PM IST
  • వేగంగా సప్లై చేయలేకపోతున్న జొమాటో
  • డెలివరీ బాయ్స్ కొరత ఎదుర్కొంటున్న జొమాటో
  • అసహనం వ్యక్తం చేస్తున్న కస్టమర్లు
Zomato పుడ్ డెలివరీలో వెనకబడిపోతున్న జొమాటో

Zomato ఫుడ్ డెలివరి రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో మెరుగైన పనితీరుతో భోజన ప్రియులకు బాగా దగ్గర అయింది. అనతికాలంలో బాగా క్లిక్ అయింది. అయితే ఈ తరుణంలో సాహసోపేత నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మరింత దగ్గర కావాలనుకున్న జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ భారీ షాక్‌ తగిలింది. ఆర్డర్ చేసిన పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్‌ వేసిన మాస్టర్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. అంత వేగంగా సప్లై చేయగలిగే డెలివరీ బాయ్స్ దొరక్క జొమాటో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో చెప్పిన టైంకు డెలివరీ చేయలేక సంస్థ ప్రతిష్ట అప్రతిష్టపాలు అయింది.

సమర్థవంతమైన సప్లై చైన్ తో అందర్ని ఆకట్టుకుకోవాలనుకున్న జొమాటో ప్యూహాలు బెడిసి కొట్టాయి. పది నిమిషాల్లో కాదు కదా అరగంటలో కూడా రాకపోవడంతో కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే జొమాటో సంస్థ మాత్రం ఈ అంశాన్ని బహిరంగంగా అంగీకరించేందుకు ముందుకు రావడం లేదు. జొమాటో ఇన్‌స్టంట్‌ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఆలస్యం కావడం లేదని సమర్థించుకుంటోంది. చెప్పిన టైంకు అందివ్వకపోవడంతో ఫుడ్ లవర్స్ జొమాటో పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతోటి దానికి జొమాటో ఇన్‌స్టంట్‌ యాప్‌ అని పెట్టి హడావిడి చేయడం దేనికని నిలదీస్తున్నారు.

కస్టమర్లకు దగ్గర కావాలనుకొని జొమాటో తీసుకున్న నిర్ణయం సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఉరుకులు పరుగుల మీద పని చేయాల్సి వస్తోంది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది ఉద్యోగులు జొమాటో వదిలి వెళ్లిపోతున్నారు. దీంతో జొమాటోకు మ్యాన్‌పవర్ కొరత పెరిగిపోతోంది. ముఖ్యంగా వర్షకాలంలో , ఎండాకాలంలో జొమాటోకు సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి. ఆర్డర్లు ఉన్నా సప్లై చేసే వాళ్లు లేక డెలివరీ చాలా జాప్యం అవుతోంది. ఈ కొరతను తగ్గించేందుకు జొమాటో జీతాలు పెంచే ఆలోచన కూడా చేయడం లేదు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న నేపథ్యంలో ఎవరో ఒకరు వచ్చి సర్వీస్ ఇస్తారని భావిస్తోంది. అయితే సంస్థ అనుకున్నట్లుగానే ఎంత మంది పని మానేసి వెళ్లిపోతున్నారో...మళ్లీ అంత మంది ఉద్యోగానికి కుదురుతున్నారు. ఇక మరో వైపు  ప్రధాన పోటీ దారు అయిన స్వీగ్గీ కూడా ఇంచు మించు ఇదే విధానాన్ని అవలంభిస్తుండడంతో పెద్దగా  పోటీ ఉండడం లేదు. మార్కెట్ మోనోపొలి అవడంతో డెలివరీ బాయ్స్‌కు కష్టాలు తప్పడం లేదు. అందుకే ఈ రంగంలో ఎక్కువ మంది ఎక్కువ కాలం పనిచేయలేకపోతున్నారు.

also read Tech Industry ఆఫీసులకు రామంటున్న ఐటీ ఉద్యోగులు

also read వారానికి నాలుగు రోజులే వర్కింగ్ డేస్..The Pros and Cons of a 4 Day Working Week

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News