India Biggest LIC IPO lists on the NSE at Rs 949 per share: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం మార్కెట్లలో లిస్టయ్యాయి. గత కొన్ని రోజులుగా గ్రేమార్కెట్ ట్రేడింగ్ సూచించిన మాదిరిగానే జరిగింది. తొలిరోజు షేర్లు ఆఫర్ ధర కంటే తక్కువ ధర వద్ద ట్రేడ్ అవ్వడంతో ఇన్వెస్టర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎన్ఎస్ఈలో ఎల్ఐసీ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే.. 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. దాంతో ఒకలాట్ (15 షేర్లు)కు రూ.14,235 పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లకు రూ.1,155 లిస్టింగ్ లాస్ మీద పడింది.
అలానే బీఎస్ఈలో ఎల్ఐసీ ఐపీఓ షేరు ఇష్యూ ధర కంటే 8.62 శాతం తక్కువగా.. రూ. 867 రూపాయల వద్ద ట్రేడింగ్ ప్రారంభం అయింది. మంగళవారం (మే 17) ఉదయం 10.15 గంటల సమయంలో బీఎస్ఈలో ఈ షేరు 899.50 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ మార్కెట్ లాభాల్లో సాగుతున్నా.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎల్ఐసీ షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్‌కు రావడం ఇప్పుడు పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ఐపీవో ద్వారా ఎల్ ఐసీ మార్కెట్ నుంచి 2060 కోట్ల రూపాయలు సమీకరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచిన ఎల్ఐసీకి దాదాపు మూడు రెట్ల స్పందన వచ్చింది. ఒక్కో షేరుపై రూ.60 రాయితీ పొందిన పాలసీదారులు.. వారికి కేటాయించిన విభాగంలో 6 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. ఉద్యోగుల విభాగంలో 1.94 రెట్లు, రిటైల్ విభాగంలో 1.94 రెట్లు, క్యూఐబీ 2.83 రెట్లు, ఎన్ఐఐలు 2.8 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణి రూ.902-949గా ప్రకటించారు. అయితే ఆర్థిక నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు మాత్రం ఎల్ఐసీ దీర్ఘకాలంలో మంచి లాభాలిస్తుందని సూచిస్తున్నారు.
Also Read: Mahesh Babu Dance: మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన మహేష్ బాబు.. ఊగిపోయిన ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook