Shani Jayanti 2022: వ్యక్తుల కర్మానుసారం వారికి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తాడు శని. ఈ నెల 30వ తేదీ (సోమవారం) శని జయంతి రాబోతుంది. ఇదే రోజున సోమవతి అమావాస్య కావడం విశేషం. ఈరోజున వట్ సావిత్రి వ్రతం కూడా చేస్తారు. పురాణాల ప్రకారం శని దేవుడు జ్యేష్ఠ అమావాస్య తిథి నాడు జన్మించాడు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య నాడు శని జయంతి జరుపుకుంటారు. శని దేవ్ పూర్తిగా నలుపు రంగులో జన్మించాడు. దీనికి కారణం మాతా ఛాయ గర్భవతిగా ఉన్న సమయంలో శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం.. అది శని దేవుడిపై కూడా ప్రభావం చూపడం.
శని దేవుడు శివుడిని ప్రసన్నం చేసుకుని... ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలాలను ఇస్తానని వరం పొందాడు. ఈసారి శని జయంతి నాడు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏలినాటి శని బాధల నుంచి విముక్తి పొందుతారు. ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు వెంటాడే శని అని అర్థం. శని జయంతి రోజు చేయాల్సిన పూజ, ఉపయోగించాల్సిన పూజా సామాగ్రి, పూజ ముహూర్తం, ధరించాల్సిన దుస్తులు తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
శని జయంతి తేదీ.. పూజా ముహూర్తం :
జ్యేష్ఠ అమావాస్య ప్రారంభ తేదీ: మే 29, ఆదివారం, మధ్యాహ్నం 02:54
జ్యేష్ఠ అమావాస్య తిథి ముగింపు: మే 30, సోమవారం, సాయంత్రం 04:59 గంటలకు
శని జయంతి పూజా ముహూర్తం: మే 30, ఉదయం 07:12 నుంచి సర్వార్థ సిద్ధి యోగం
అదృష్ట సమయం: ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:46 వరకు
శని జయంతి 2022 పూజా సామగ్రి
శని జయంతి రోజున, కర్మ ప్రదాత అయిన శని దేవుడిని పూజించడానికి అవసరమైన కొన్ని ముఖ్యపదార్థాల జాబితా కింద ఇవ్వబడినది.
1. శని దేవుడి విగ్రహం లేదా చిత్రపటం
2. నలుపు, నీలం దుస్తులు
3. నల్ల నువ్వులు
4. పూల దండ
5. ఆవాల నూనె, నువ్వుల నూనె
6. శని చాలీసా, శని దేవుడి పురాణం
7.శమీ ఆకు
8. అక్షతం, ధూపం, దీపం, నీరు
9. హోమం
శని దేవుడి పూజా విధానం :
శని జయంతి రోజున ఉదయాన్నే తలస్నానం చేయాలి. శని దేవాలయానికి వెళ్లి శని దేవుడిని పూజించాలి. అక్షత, పూల మాల, నీలి పుష్పాలు, శమీ ఆకులు, ధూపం, దీపం,నల్ల నువ్వులు, ఆవనూనె, వస్త్రాలు మొదలైనవి సమర్పించాలి. శని దేవ్, ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. శని చాలీసా, శని స్తోత్రం, శని దేవుడి జన్మ కథ చదవాలి. శని దేవుడి హారతితో పూజను ముగించాలి. పూజా క్రతువును ముగించే ముందు మీ మనసులో కోరికను శని దేవుడికి నివేదించండి. శని బాధల నుంచి విముక్తి కల్పించమని వేడుకోండి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించి ఏలినాటి శని బాధలు తొలగిపోతాయి.
ఇవి దానం చేయాలి :
శని జయంతి సందర్భంగా నల్ల నువ్వులు, నల్ల ఉసిరి, ఇనుము, స్టీలు పాత్రలు, పాదరక్షలు, చెప్పులు, శని చాలీసా, నలుపు లేదా నీలం రంగు దుస్తులు, ఆవనూనె, నువ్వుల నూనె, నీలిరంగు పూలు మొదలైన వాటిని దానం చేయాలి. శని జయంతి రోజు వీటిని దానం చేయడం వల్ల ఆ వ్యక్తులకు శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది.
Also Read:Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.