OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్

OTT Streaming: మెగా అభిమానులకు ఇవాళ పండగే. అటు ఆర్ఆర్ఆర్..ఇటు ఆచార్య రెండూ ఇవాళ్టి నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2022, 09:41 AM IST
  • మెగాస్టార్ అభిమానులకు పండగ, ఇవాళ్టి నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న ఆచార్య, ఆర్ఆర్ఆర్
  • అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కానున్న ఆచార్య సినిమా
  • జీ5లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా
OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్

OTT Streaming: మెగా అభిమానులకు ఇవాళ పండగే. అటు ఆర్ఆర్ఆర్..ఇటు ఆచార్య రెండూ ఇవాళ్టి నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇవాళ్టి నుంచి మెగాస్టార్ చిరు, రామ్‌చరణ్ నటించిన ఆచార్య, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది..బ్లాక్ బస్టర్‌గా రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలు ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 11 వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి..ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు సిద్దమౌతోంది. ఈ సినిమా ఇవాళ్టి నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక మరోవైపు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మెగాస్టార్ చిరు సినిమా ఆచార్య కూడా ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రామ్‌చరణ్ తేజ్ కూడా ప్రత్యేక పాత్రలో కన్పిస్తాడు. పూజాహెగ్డే చెర్రీ సరసన హీరోయిన్‌గా నటించింది. 

Also read: Cannes Film Festival 2022: భారతీయ సినిమా, ఓటీటీల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News