Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. తాజాగా సోనియా గాంధీతో ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రధానంగా ఏపీలో పార్టీ పరిస్థితిపై మంతనాలు జరిపారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతం సలహాలు, సూచలను కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి సోనియా గాంధీ తీసుకున్నారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రత్యేకంగా పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ఆయన సోనియా గాంధీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విభజన పాపం నుంచి బయట పడాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈక్రమంలోనే పీసీసీని మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శైలజానాథ్ ..ఏపీసీసీగా కొనసాగుతున్నాయి. ఆయన స్థానంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో సమైక్య రాష్ట్రం కోసం కిరణ్‌కుమార్ రెడ్డి పోరాటం చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపైనే తిరుగుబాటు చేశారు. తాజాగా ఆయనకు పీసీసీ బాధ్యతలు ఇస్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పీసీసీగా రఘువీరారెడ్డి కొనసాగారు. ఆ తర్వాత ఆ పదవి కోసం నేతలు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు మాజీ మంత్రి శైలజానాథ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. విభజనను మరిచిపోయి..రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే ప్రజా సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తున్నారు. పార్టీని వీడిన నేతలందరినీ ఏకంగా చేయాలని చూస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఏమేరకు విశ్వసిస్తారో చూడాలి..
Also read:Elon Musk Issue:ఎలాన్ మస్క్‌పై ఇన్‌సైడర్ సంచలన కథనం..విషయం ఏంటి..?
Also read:Delhi TRS Bhavan:దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు షురూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.'
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook