Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా రేవంత్ రెడ్డికి పేరు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై చాలా కాలంగా పోరాడుతున్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ జనాల్లోనూ మంచి క్రేజీ ఉంది. అందుకే చాలా మంది సీనియర్లు పోటీపడినా.. ఆయనకు పీసీసీ పీఠం కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పీసీసీ చీఫ్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. కాంగ్రెస్ కేడర్ లో జోష్ నింపుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే.. రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాపనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయం. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
రేవంత్ రెడ్డి సొంతూరు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లి. కాని రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగింది మాత్రం కొడంగల్ నియోజకవర్గం. కొడంగల్ నియోజకవర్గంలోనే రాజకీయాలు ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. మొదట జడ్పీటీసీగా గెలిచారు. తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక 2009, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2018 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా కొడంగల్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా , కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. తానే గెలవలేకపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆయనపై గెలిచారు. కొడంగల్ ఓటమి రేవంత్ రెడ్డినే కాదు తెలంగాణ వ్యాప్తంగా సంచలనమైంది. తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి గెలిచారు.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్న రేవంత్ రెడ్డి.. కొత్త సీటుకు వెళ్లనున్నారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలోనే పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. ఎల్బీనగర్ లేదా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచే టాక్ వచ్చింది. సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి ఈ సీట్లను ఎంచుకున్నారని భావించారు. కాని తాజాగా రేవంత్ రెడ్డి పోటీ విషయంలో కొత్త నియోజకవర్గం తెరపైకి వస్తోంది. తన సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే పోటీ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లున్నాయి. రేవంత్ పోటీ చేస్తే .. ఈ 14 నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే రేవంత్ కూడా పాలమూరు నుంచే పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కొడంగల్ కాకుండా మహబూబ్ నగర్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ పై ఇటీవల కాలంలో చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ కేడర్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఫిర్యాదుల ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ రేవంత్ ను కలిసి.. ఇక్కడి నుంచే అసెంబ్లీ పోటీ చేయాలని కోరారని తెలుస్తోంది. అందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని అంటున్నారు.
మరోవైపు కొడంగల్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కొడంగల్ తో రేవంత్ రెడ్డి బంధం తెంచుకోరని చెబుతున్నారు. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయని పక్షంలో.. ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పోటీ చేయవచ్చనే టాక్ కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తోంది.
READ ALSO: CM Jagan Davos: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. చంద్రబాబును మరిపించేనా?
READ ALSO: PM Modi Hyderabad Tour: హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో? భారీగా జనసమీకరణకు బీజేపీ ప్లాన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Revanth Reddy: కొత్త నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి ఫోకస్.. పోటీ అక్కడి నుంచేనా?
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు మారనున్న రేవంత్!
మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం
కొడంగల్ నుంచి రెండు సార్లు గెలిచిన రేవంత్ రెడ్డి