Jharkhand School Girl Attacked: జార్ఖండ్‌లో ఓ స్కూల్ విద్యార్థిని పట్ల ఓ బాలుడు అమానుషంగా వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న ఆ బాలికను పంట పొలాల్లోకి తీసుకెళ్లి అతను దాడికి పాల్పడ్డాడు. బాలికను కిందపడేసి కాళ్లతో తన్నాడు. ఈ వీడియోని తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ తక్షణమే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని పాకూర్ జిల్లాకు చెందిన ఆదివాసీ బాలికగా... నిందితుడిని దుంకా జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడిగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాలుడు దాడి చేస్తున్న సమయంలో అతని స్నేహితుడు సెల్ఫోన్లో వీడియో తీసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పాకూర్ ఎస్పీ హర్దీప్ జనార్ధన్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
.@pakurpolice कृपया उक्त मामले की जांच कर आरोपियों पर कार्यवाई करते हुए सूचित करें।@dcpakur @JharkhandPolice https://t.co/UO6W841jqB
— Hemant Soren (@HemantSorenJMM) May 22, 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.