COVID-19 కోవిడ్ వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుకుంటూ పోతున్నాయి. కాంపోనెంట్‌ల కొరత, చిప్ ల కొరత, సరఫరా అంతరాయాల కారణంగా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగిపోతున్నాయి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(IDC) డేటా ప్రకారం... భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ అమ్మాకాలు క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతూ ఈసారి ఏకంగా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. లాడ్ కారణంగా ప్రజలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు బిజీ అయిపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ వాడకానికి బాగా అలవాటు పడ్డారని సర్వేలో తేలింది. అయితే ఆ తర్వాత కూడా ఈ స్మార్ట ఫోన్ వాడకాన్ని తగ్గించడం లేదని తేలింది. దీంతో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరిందని తేలింది.
అయితే మోబైల్ ఫోన్ల తయారీలో వాడే విడిభాగాలు ఎక్కువగా చైనాలో తయారీ అవుతున్నాయి. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో మొత్తం మోబైల్ తయారీ ఖర్చు ఏకంగా 20 శాతం వరకు పెరిగిపోయింది. ఈకారణంగా ధరలు పెరిగిపోయాయి. మోబైల్ మార్కెట్‌లో ప్రపంచ దిగ్గజాలు అయినా Samsung, Xiaomi, Oppo, Realme వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమ ఫోన్లను తక్కువ ధరకే లాంచ్ చేశాయి. అయితే ఆతర్వాత విడిభాగాల ధరలు అమాతం పెరిగిపోవడంతో మోబైల్ పోన్ల ధరలు కూడా పెంచాల్సి వచ్చింది.
విడిభాగాలు తక్కువ ధరలకు అందితే మోబైల్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తామని సంస్థలు చెబుతున్నాయి. విడిభాగాల పెరుగుదల కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని వెల్లడించాయి. మరోవైపు కోవిడ్ కారణంగా సప్లై చైన్ దెబ్బతినడం వల్ల ఇంకా విడి భాగాల కొరత దారుణంగా ఉందని మోబైల్ సంస్థలు వెల్లడించాయి. మరికొంత కాలం గడిచి ఉత్పత్తి మెరుగైన తర్వాత ధరలు తగ్గి వస్తాయని తెలిపాయి. అప్పుడు తప్పకుండా ధరలు తగ్గించి వినియోగదారులకు తక్కువ ధరలకే మోబైల్ ఫోన్లు అందిస్తామని సంస్థలు వెల్లడించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G Gautam Adani $100 బిలియన్లు నష్టపోయినా ఇంకా అపర కుబేరుడిగా కొనసాగుతున్న అదానీ
Apple Link - https://apple.co/3loQYe MARA RAJA BATTERIES,అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు సిద్ధం అవుతున్న అమర్ రాజా బ్యాటరీస్
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook