Nayanthara Vignesh Shivan wedding: స్టార్ నటి నయనతార, దర్శకుడు విష్నేుశ్ శివన్ (Vignesh Shivan) ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలలో వీరి విహహం వచ్చే నెల 9న జరగనుందని మెున్నటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా పెళ్లి వేదిక మారినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. పెళ్లికి (Nayanthara Vignesh Shivan wedding) ఆహ్వానిస్తూ.. నయన్-విఘ్నేశ్ ఇప్పటికే తమ స్నేహితులదరికీ ఓ వీడియో ఇన్విటేషన్ పంపించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ప్రకారం వీరి వివాహం జూన్ 9న మహాబలిపురంలోని మహబ్ హోటల్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఈమె శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయాణం కొనసాగించింది. అయితే ఏమైందో తెలియదు కానీ.. నయన్ వారిద్దరికీ బ్రేకప్ చెప్పేసింది. తర్వాత కొన్ని నెలలు పాటు సైలెంట్‌గా ఉన్న నయన్ (Nayanthara) ..నానుమ్ రౌడీ తాన్ సినిమాతో దర్శకుడు విఘ్నేష్ తో ప్రేమలో పడింది. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోనే విజయ్ సేతుపతి, సమంతతో కలిసి కణ్మణి రాంబో ఖతీజా సినిమాలో నటించింది నయన తార. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది.
Also Read: Video: బోల్డ్ టాక్... ప్రైవేట్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన టాప్ డైరెక్టర్ కూతురు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook