Sunil Gavaskar says Hardik Pandya to become India captain in future: ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. హార్ధిక్ అద్భుతమైన కెప్టెన్సీ నైపుణ్యాలను కలిగి ఉన్నాడని, అతడు ఖచ్చితంగా టీమిండియా కెప్టెన్ అవుతాడన్నారు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో కచ్చితంగా హార్దిక్ ఉంటాడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 29) రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. లీగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సాధించింది.
ఐపీఎల్ 2022 ఆసాంతం హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీని దగ్గరుండి చూసిన సునీల్ గవాస్కర్ అతడిపై తన అభిప్రాయం చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్‌తో గవాస్కర్ మాట్లాడుతూ... 'హార్ధిక్ పాండ్యా ఖచ్చితంగా టీమిండియాకు కెప్టెన్ అవుతాడు. ఇది నా ఒక్కడి అంచనా మాత్రమే కాదు.. అందరి అంచన. ఐపీఎల్ 2022లో బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు. సీజన్ ఆరంభానికి ముందు హార్దిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడా? అన్న సందేహం అందరిలో ఉండేది. వాటిని పటాపంచలు చేస్తూ తన సత్తా ఎంటో చూపించాడు. మంచి ఆల్‌రౌండర్ అని నిరూపించుకున్నాడు' అని అన్నారు.
'హార్దిక్ పాండ్యాలో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అతను జట్టును నడిపించిన విధానం, ఆటగాళ్లతో ఉన్న సంబంధాలు అద్భుతం. ఏ ఆటగాడైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సారథి రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యాతో పాటు 3-4 పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో హార్దిక్ ముందువరుసలో ఉన్నాడని కచ్చితంగా చెప్పలేను. అయితే సెలక్షన్ కమిటీకి హార్దిక్ ఎంపిక బాగుంటుంది అని చెప్పగలను' అని సన్నీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022లో హార్ధిక్ పాండ్యా సారథిగా అద్భుతంగా రాణించాడు. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు అందించి.. గుజరాత్ టైటాన్స్ జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. క్వాలిఫైయర్ 1. ఫైనల్ మ్యాచుల్లో కూడా అద్భుత కెప్టెన్సీ చేశాడు. ఇక బాల్, బ్యాట్‌తో కూడా రాణించాడు. ఈ సీజన్లో15 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్.. 487 పరుగులతో పాటు, 8 వికెట్లు పడగొట్టాడు.
Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!
Also Read: IPL 2022 Awards List: ఐపీఎల్ 2022 అవార్డు విజేతలు వీరే.. ఆ ఐదు అవార్డులు బట్లర్‌కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook