Horoscope Today June 1st 2022: నేటి రాశి ఫలాల ప్రకారం... వ్యాపార రంగంలో ఉన్న కొన్ని రాశుల వారికి ఇవాళ అనుకూల సమయం. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలకు ఇది తగిన సమయం. అక్రమ వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం తీవ్ర కష్ట, నష్టాలు తప్పవు. పలు రాశుల వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగాలని అనిపించకపోయినా... కొత్త ఉద్యోగం వచ్చే వరకు పనిచేస్తూ ఉండండి. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. యువతకు నిత్యం కొత్త స్నేహితులు పరిచయమవుతారు. అయితే మంచివారితోనే ఫ్రెండ్ షిప్ చేయండి. మందు బాబుల జోలికి అస్సలు వెళ్లవద్దు. మీరు చేపట్టే పనుల్లో కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లో పాత చుట్టాలంతా కలుసుకుంటారు. వేసవిలో పిల్లలకు ఐస్ క్రీం, చల్లని పానీయాలు ఇవ్వొద్దు. వాటివల్ల గొంతు నొప్పి రావచ్చు. మీకు దక్కే గుర్తింపు, గౌరవం మీ మాటలపై ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమతో మాట్లాడితే.. ఎవరైనా కనెక్ట్ అవుతారు.
వృషభ రాశి (Taurus)
యజమానితో వివాదాలు వద్దు. ఆహార పానీయాల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. మాదక ద్రవ్యాల వ్యాపారులు నష్టపోతారు. స్నేహితులతో గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదవాలి. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. వారికి సేవ చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఏమాత్రం మంచిది కాదు. వివాహ వేడుకలకు వెళ్లే అవకాశం ఉంటుంది. బంధువులతో గడపడానికి ఇష్టపడుతారు.
మిథున రాశి (GEMINI)
చాలా మంది సహోద్యోగులు మీ విజయాలను చూసి అసూయపడవచ్చు. కానీ మీరు ఎవరికీ చెడు చేయకూడదు. వ్యాపార భాగస్వామితో ఏదైనా విషయంలో వివాదాలు ఉండవచ్చు. ఇద్దరి మధ్య పారదర్శకత ఉండాలి. గాయపడే ప్రమాదం ఉన్నందునా ఈరోజు యువత అనవసరంగా బయట సంచరించకూడదు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు కాస్త టెన్షన్ పడుతారు. ఆపదలో ఉన్నవారికి తోచిన సహాయం చేయండి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోండి. స్వీయ మందులు సమస్యలను కలిగిస్తాయి. చెట్ల పెంపకంలో ఎక్కువ సమయం గడుపుతారు.
కర్కాటక రాశి (Cancer)
ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ పనిపై దృష్టి పెట్టండి. అస్సలు తప్పు చేయవద్దు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త పాఠాలు నేర్చుకుంటారు. మీరు వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే... అందుకు తగిన ప్రణాళిక వేసుకునేందుకు ఇది అనువైన సమయం. యువతకు ఉన్నత విద్యకు అవకాశాలు లభిస్తాయి. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లండి. మీ మెడ, వెనుక భాగంలో నొప్పి ఉండవచ్చు. నొప్పి ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి. లేని తలనొప్పులు కొనితెచ్చుకున్నట్లవుతుంది.
సింహ రాశి (LEO)
ఆఫీస్‌లో పని ఎక్కువ, జీతం తక్కువగా ఉంటే మనసు కష్టపెట్టుకోకుండా ఓపికగా పని చేయండి. పాత పరిచయాలు కొత్త అవకాశాలను అందిస్తాయి. మీకు తెలియకుండానే మీ సంపాదన బయటి మార్గం పట్టవచ్చు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. యువతపై ఉన్నతాధికారుల పని ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు మీరు పూర్తి చేయాల్సిన టార్గెట్ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో ప్రతి బంధానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. సంబంధాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వేపుడు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. తేలికపాటి భోజనం చేయండి. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబం లేదా స్నేహితులు లేదా పొరుగువారితో వాదనలకు దిగకండి. ప్రతికూల గ్రహాల వల్ల అనుకోని కలహాలు వస్తాయి.
కన్య రాశి (Virgo)
కన్యా రాశి వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల వంతు పని కూడా చేయాల్సి రావచ్చు. వ్యాపార విస్తరణకు ప్రణాళిక ఉండాలి. మీరు ఫ్రాంచైజీల ద్వారా ఇతర నగరాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. యువత తమ పని పూర్తి చేసుకోలేక మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ఒత్తిడిని వీడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మంచిదే కానీ ఏదైనా చేసే ముందు పెద్దల అభిప్రాయం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వేసుకునే వారు, ఆ మందులు సమయానికి తీసుకోవడం మరచిపోవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, నిత్యం వ్యాయామం చేయండి. ఉదయాన్నే నిద్రలేచి కొంత దూరం నడవడం ఇంకా మంచిది.
తులా రాశి (Libra)
చిన్న విషయాలను అతిశయోక్తి చేయడం మానుకోండి. ఆఫీసులో అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. వైద్య రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభదినం. ఇతర వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. యువకులు ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయండి. కుటుంబంలో తండ్రితో సామరస్యంగా నడుచుకుంటారు. పెద్దలకు సేవ చేస్తేనే మంచి శ్రేయస్సు. జంక్ ఫుడ్, నాన్ వెజ్‌కి దూరంగా ఉండండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. సంభాషణ, సహకారం మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీ ప్రియమైనవారితో కమ్యూనికేషన్ లేకపోవడం బాధిస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో సంక్షోభం ఏర్పడవచ్చు. పని చేయండి... అదే సమయంలో మీ ప్రవర్తనలో లోపాలను సరిదిద్దుకోండి. వ్యాపారంలో కొత్త భాగస్వాములను చేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. మీ వ్యాపార భాగస్వామి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిరంతర అధ్యయనంపై దృష్టి పెట్టండి. కొన్ని విషయాలు మరచిపోవచ్చు.. కాబట్టి మీరు దానిని రాసి గుర్తుంచుకుంటే మంచిది. కుటుంబంలో ఒకరికొకరు సాయపడాలి. కుటుంబ సభ్యుల మధ్య బంధం ఎంత మెరుగ్గా ఉంటే అంత దృఢంగా ఉంటుంది. మీరు ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ముఖ్యమైన మెయిల్ కనిపించకుండా పోయి, తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వవద్దు.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈరోజు ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉంటే, టాపిక్ ప్రకారం ప్రిపరేషన్ పూర్తి చేయండి. సంస్థ పట్ల నిజాయితీ చాలా ముఖ్యం. మీరు మీ వ్యాపార స్థలంలో అనవసర కోపానికి దూరంగా ఉంటే మంచిది. వ్యాపారంలో లాభనష్టాలుంటాయి. యువతకు అవాంఛనీయ ఖర్చుల జాబితా చాలా పొడవుగా ఉంటే, వెంటనే దాన్ని తగ్గించండి, లేకుంటే ఈ జాబితా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
అప్రమత్తంగా ఉండండి మరియు ఏదైనా వ్యాధి ఉంటే, వారికి సరైన చికిత్స అందించండి. డ్రగ్స్ బానిసలు అప్రమత్తంగా ఉండాలి, అది వారికి హానికరం. మీరు మీ సర్కిల్లోని వ్యక్తులందరినీ కలవలేకపోతే, ఫోన్లో సన్నిహితంగా ఉండండి.
మకర రాశి (Capricorn)
మకర రాశి వారు కొత్త ఉద్యోగంలో చేరినట్లయితే, సమయం విలువను అర్థం చేసుకుని, సమయానికి కార్యాలయానికి చేరుకోండి. వ్యాపారంలో మీ భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించండి. వివాదానికి అవకాశం ఉంది. డబ్బు సేవ్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. యువత ఈరోజు స్నేహితులను కలుస్తారు.వారితో కూర్చుని కాసేపు మాట్లాడితే మనసుకు ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులందరి సహకారంతో కుటుంబ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. కడుపునొప్పి వచ్చే అవకాశం ఉన్నట్లయితే, కడుపులో నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే, డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స పొందండి. మీ స్వభావంలో వినయం ముఖ్యం.
కుంభ రాశి (Aquarius)
ఉద్యోగం లేని కారణంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి మీ నెట్‌వర్క్‌ను విస్తృతం చేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన విస్తరణ కూడా జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లో చదువుతున్న యువతకు కంపెనీలు ప్లేస్‌మెంట్స్ ఇవ్వకపోతే ప్లేస్మెంట్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. కుటుంబ వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి వ్యక్తి శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. ఇతరులతో వివాదాలు ఉంటే వారికి దూరంగా ఉండాలి.
మీన రాశి (Pisces)
ఆఫీసులో చాలా మంది వ్యక్తులు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. మీ బలం మీ నిజమైన స్నేహితుడు. వ్యాపార ప్రత్యర్థులు మీకు కఠినమైన సవాల్ విసురుతారు. మీ పనిని చాలా జాగ్రత్తగా చేయండి, అలాగే కొత్త ప్రయోగాలు చేయండి. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే, ఇప్పుడు దానిని రిలేషన్‌షిప్‌కి మార్చుకునే దిశగా అడుగులు వేయవచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రక్రియ కుటుంబ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. మీరు బిపి పేషెంట్ అయితే, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేనిపక్షంలో అది గుండెపై ప్రభావం చూపుతుంది. పేద పిల్లల చదువుకు సంబంధించిన పనుల్లో సహకరించే అవకాశం వస్తే తప్పకుండా చేయండి, అది గొప్ప పుణ్యం.
Also Read: Wednesday Remedy : బుధవారం ఇలా చేస్తే కష్టాలకు పక్కా పుల్‌స్టాప్ పడుతుంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook