CM KCR: ఉమ్మడి ఏపీకి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారా?చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారా?

CM KCR:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? ఆ ప్రయత్నం విఫలం అయ్యాకే తెలంగాణ ఉద్యమం ప్రారంభించారా?..కేసీఆర్ కు సంబంధించిన ఈ విషయంపై గతంలోనూ చర్చ సాగింది. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నించారని.. గతంలో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న నేత కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

Written by - Srisailam | Last Updated : Jun 3, 2022, 10:13 AM IST
  • ఉమ్మడి ఏపీకి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారా?
  • కేసీఆర్ పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
  • చంద్రబాబును దింపాలని చూశారని కామెంట్
CM KCR: ఉమ్మడి ఏపీకి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారా?చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారా?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్నారా? ఆ ప్రయత్నం విఫలం అయ్యాకే తెలంగాణ ఉద్యమం ప్రారంభించారా?..కేసీఆర్ కు సంబంధించిన ఈ విషయంపై గతంలోనూ చర్చ సాగింది. తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నించారని.. గతంలో ఆయనతో సన్నిహిత సంబంధాలున్న నేత కామెంట్ చేయడం సంచలనంగా మారింది.

2015లో వెలుగు చూసిన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాల్లో  తీవ్ర సంచలనం రేపింది. టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని కేసీఆర్ ఓపెన్ గానే ఆరోపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో  63 సీట్లు గెలిచి గులాబీ పార్టీ అధికారం చేపట్టింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ కన్నా కేవలం మూడు సీట్లు మాత్రమే టీఆర్ఎస్ ఎక్కువగా గెలుచుకుంది. ఆ సమయంలోనే ఓటుకు నోటు కేసు వెలుగుచూసింది. దీంతో విపక్ష పార్టీలను ఏకం చేసి.. టీఆర్ఎస్ ను చీల్చి కేసీఆర్ ను గద్దే దింపాలని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు ఈ ఆరోపణలు చేశారు. అయితే తాజాగా కేసీఆర్ కు సంబంధించిన మాజీ మంత్రి, ప్రసుత్తం బీజేపీలో ఉన్న చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ తో కలిసి టీడీపీలో పని చేశారు చంద్రశేఖర్. ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. దీంతో చంద్రశేఖర్ చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నించారని చంద్రశేఖర్ చెప్పారు. చంద్రబాబు రెండో ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు కేసీఆర్. మంత్రి పదవి ఆశించిన కేసీఆర్ ను డిప్యూటీ స్పీకర్ చేశారు చంద్రబాబు. దీంతో బాబుతో కేసీఆర్ కు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలోనే చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్ కుట్రలు చేశారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కూడగట్టారని తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహా పలువురు సీనియర్లు కేసీఆర్ కు మద్దతు ఇచ్చారన్నారు. తనతోనూ కేసీఆర్ చర్చించారని చెప్పారు. అయితే కేసీఆర్ ఎత్తులను పసిగట్టిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రు.. చంద్రబాబుకు చెప్పారని చంద్రశేఖర్ వెల్లడించారు. దీంతో చంద్రబాబు అలర్ట్ అయి కేసీఆర్ చర్చించిన ఎమ్మెల్యేలతో మాట్లాడి తన దారికి తెచ్చుకున్నారని చంద్రశేఖర్ వివరించారు.

తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్.... తనను సీఎం చేస్తానని చాలా సార్లు చెప్పారని చంద్రశేఖర్ అన్నారు. దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన వద్దని కొందరు సీనియర్లు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని.. కాని తీరాక అధికారంలోకి వచ్చాకా తానే సీఎం పీఠంపై కూర్చున్నారని చంద్రశేఖర్ విమర్శించారు. గతంలో కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్న చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయంగా సంచలనంగా మారాయి.  

READ ALSO: CHARMINAR WAR: చార్మీనార్ పై కాంగ్రెస్, బీజేపీ ఫైట్.. అసలు వివాదం ఏంటీ? హైదరాబాదీలు ఏమంటున్నారు?

READ ALSO: LPG subsidy: కేంద్ర సర్కార్ భారీ షాక్.. వంట గ్యాస్‌‌పై సబ్సిడీ ఎత్తివేత.. మరిన్ని షాకులు తప్పవా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News