Hearing loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే వినికిడి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి వెనుక చాలా కారణాలున్నాయి. వినికిడి సమస్యల గురించి యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ఈఎన్‌టీ నిపుణుడు సౌరభ్ అగర్వాల్ వివరణ ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం.
యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈఎన్ టీ నిపుణుడు సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ.. అనారోగ్యానికి సంబంధించిన కొన్ని రకాల మందులను ఎక్కువగా వాడితే చెవుడు వచ్చే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా నోప్పుల టాబ్లెట్లు క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చెవుడు వస్తుందని వారు చెబుతున్నారు.
కీమోథెరపీ, క్యాన్సర్ నిరోధక మందులు, కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని మలేరియా నిరోధక మందులు వంటి కొన్ని టాబ్లెట్లు చెవి నరాలపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణుడు సౌరభ్ అగర్వాల్ చెప్పారు. జుట్టు మీద చెడు ప్రభావం కూడా పడే అవకాశాలున్నాయని ఆయన తెలుపుతున్నారు. ఈ టాబ్లెట్లును వాడినప్పుడు మొదట పెద్దగా ప్రభావం లేకున్న..తర్వాత తర్వాత చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
చెవి వినికిడిని మెరుగు పడడానికి మార్గాలు:
- చెవికి వినికిడి శక్తి పెరగాలంటే యోగా చేయాలి.
- చెవులు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
- చెవులను శుభ్రం చేయడానికి ఆవాల నూనెను ఉపయోగించండి.
- వినికిడి లోపం యొక్క కారణాలపై శ్రద్ధ వహించండి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి
Also Read: Vitamin D Benefits: విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారా..అయితే ఈ చిట్కాలు పాటించండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook