India vs England: భారతజట్టు ఇంగ్లండ్ పర్యటన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్..కోచ్‌గా వ్యవహరించనున్నాడు.జూలై నెలలో పది రోజులపాటు సిరీస్ జరగనుంది.
ఐపీఎల్ 2022 తరువాత టీమ్ ఇండియా ముందు రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 కాగా రెండవది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్. టీ20 ప్రపంచకప్ కంటే ముందు టీమ్ ఇండియా కీలకమైన సిరీస్ ఆడనుంది. ఇంగ్లండ్‌లో ఇండియా టెస్ట్ సిరీస్ కీలకంగా మారనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో విజయం ద్వారా ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్స్ మెరుగుపర్చుకోవల్సి ఉంది. ఒకేసారి రెండు రేసుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. మరోవైపు జూన్‌లో టీ20తో పాటు టెస్ట్ టీమ్ కూడా ఆడాల్సి ఉంది.
జూన్ 26 మరియు 28 తేదీల్లో ఇండియా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో ఇండియా టెస్ట్ టీమ్ నాలుగురోజుల ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. వారం రోజుల తరువాత టీమ్ ఇండియా..ఇంగ్లండ్‌తో టెస్ట్ జూలై 1 నుంచి 5వ తేదీ వరకూ ఆడాల్సి ఉంది. అదే సమయంలో టీ20 వార్మ్ అప్ మ్యాచ్ ఆడాలి.
బీసీసీఐ ఇంగ్లండ్ పర్యటన కోసం పూర్తి జట్టును సిద్ధం చేసింది. అయితే ఐర్లాండ్‌లో జరిగే ఇండియా-ఇంగ్లండ్ టీ 20 సిరీస్‌కు మాత్రం ఇంకా జట్టు ప్రకటించాల్సి ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రెండు జట్లలో ఉంటారు. ఐపీఎల్ 2022లో ప్రతి భ కనబర్చిన ఆటగాళ్లకు బీసీసీఐ ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించవచ్చు.
Also read: ఆ ప్లేయర్ భారత జట్టుకు భారమయ్యాడా?.. రిటైర్మెంట్ ఇవ్వక తప్పదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook