Corn Benefis: ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మొక్కజొన్న. మొత్తం పంటలో 20 శాతం ఆహారం కోసం వినియోగిస్తుంటే..మిగిలిందంతా..పౌల్ట్రీ ఫీడ్, జంతువుల దాణా, రెడీమేడ్ ఫుడ్, స్టార్చ్ వంటివాటి కోసం ఉపయోగిస్తున్నారు. పాప్ కార్న్ లేదా బేబీ కార్న్ ఉపయోగాలేంటో చూద్దాం..
జొన్న రొట్టెలంటే తెలియనివాళ్లుండరు. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన చాలా ఎక్కువ ఇది. ఇది రుచికరమైందే కాకుండా హెల్తీ ఫుడ్ కూడా. మొక్కజొన్న రొట్టె ఎక్కువగా చలికాలంలో తింటుంటారు. జొన్న రొట్టెలు, మొక్క జొన్న అనేవి భారతీయుల జీవితంలో ఓ భాగంగా ఉన్నాయి. దేశంలో వందల ఏళ్ల క్రితమే ఈ పంటను పండించారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న పంటే ఎక్కువగా పండిస్తున్నారు.
ప్రస్తుతం మొక్కజొన్న సీజన్ నడుస్తోంది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఇవే కన్పిస్తున్నాయి. కాల్చిన మొక్కజొన్నకు మసాలా, నిమ్మకాయ పూసి తింటుంటారు. ఆ సువాసనను ఎప్పటికీ మర్చిపోలేం. భారతీయులకు మొక్కజొన్నతో తరతరాల అనుబంధముంది.
9 వేల ఏళ్ల చరిత్ర మొక్కజొన్నది
మొక్కజొన్న పంటనేది 9 వేల ఏళ్ల క్రితం మెక్సికో ప్రాంతంలోని బాల్‌సాల్ నదీ పరివాహక ప్రాంతంలో పండించారని చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అక్కడి నుంచి ఈ మొక్కజొన్న అమెరికా వంటి ఇతర ప్రాంతాలకు తరలింది. అమెరికాలో ప్రాచీనకాలం నుంచే మొక్కజొన్న అధికంగా పండిస్తూ వస్తున్నారు. మొక్కజొన్న అనేది భారతదేశ పంట కాదు. ఎందుకంటే ప్రాచీన ఆయుర్వేద పుస్తకాల్లో మొక్కజొన్న ప్రస్తావన లేదు. కేవలం గోధుమల గురించి మాత్రమే ఉంది. హిందూ మత గ్రంధాల్లో గోధుమలు, లేదా జొన్నల గురించి ఉంది. దేశంలో మొక్కజొన్న పంటను 16 వందల సంవత్సరం నుంచి పండిస్తున్నారు.
మొత్తం ప్రపంచంలో మొక్కజొన్నే అధికంగా పండించే పంటగా ఉంది ఇప్పటికీ. అమెరికాలో అయితే అగ్రస్థానం మొక్కజొన్నదే. ప్రపంచంలో పండించే మొత్తం మొక్కజొన్న విస్తీర్ణంలో 35 శాతం అమెరికా నుంచే ఉంది. ఆ తరువాత చైనా రెండవ స్థానంలో, బ్రెజిల్, మెక్సికో, ఆర్జెంటీనా, ఇండియా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
అమెరికాలో మొక్కజొన్న పెద్దఎత్తున లభిస్తుంది. ఆ తరువాత చైనా, బ్రెజిల్ దేశాల్లో దొరుకుతుంది. మొక్కజొన్నను ఆహారంగా తీసుకునే దేశాల్లో ఇండియాది 7వ స్థానం. మొత్తం ప్రపంచంలో పండించే మొక్కజొన్నలో 20 శాతం భోజనం నిమిత్తం ఉపయోగిస్తుంటే..మిగిలిందంతా పౌల్ట్రీ ఫీడ్, జంతువుల దాణా, రెడీమేడ్ ఫుడ్, స్టార్చ్ వంటివాటి కోసం వినియోగిస్తున్నారు.
ఆధునిక యుగంలో పాప్ కార్న్ లేదా బేబీకార్న్ రూపంలో మొక్కజొన్న పంట గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో బెస్ట్ పుడ్‌గా మొక్కజొన్నకు పేరుంది. పాప్ కార్న్ తినడమనేది ఓ అలవాటని..అమెరికా, బ్రిటన్ దేశాల్లో పాప్ కార్న్ అంటే పడిచచ్చేవాళ్లున్నారని తెలుస్తోంది. పౌష్ఠికం, రుచికరమైంది కావడం, కొలెస్ట్రాల్ లేకపోవడంతో బేబీకార్న్ ప్రాచుర్యం పొందింది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
మొక్కజొన్న తీయగా, చల్లగా ఉంటుంది. పోషక పదార్ధాల్ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. మొక్కజొన్న గుండెకు చాలా మంచిదని అంటున్నారు. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మొక్కజొన్నలో పెయిన్ కిల్లర్ గుణాలుంటాయి. జీర్ణ ప్రక్రియలో సమస్య ఉన్నవాళ్లు మొక్కజొన్న తక్కువగా తీసుకోవాలి.
Also read: Cholesterol Reduce Tips: కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం..తప్పకుండా ఈ సూచనలను పాటించండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook