Health Tips: పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!

Health Tips: ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  శరీరాన్ని చల్లదనంగా ఉంచుతుంది.  పుచ్చ పండు కాకుండా పుచ్చకాయ తొక్కతో కూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 11, 2022, 09:24 AM IST
  • పుచ్చకాయ తొక్క వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు
  • తొక్కను జ్యూస్‌ల చేసుకోవచ్చు
  • ఈ జ్యూస్‌ బరువును నియంత్రిస్తుంది
Health Tips: పుచ్చకాయ తొక్క వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు..!

Health Tips: ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల  శరీరాన్ని చల్లదనంగా ఉంచుతుంది.  పుచ్చ పండు కాకుండా పుచ్చకాయ తొక్కతో కూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుందని వారు చెబుతున్నారు.  వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల  శరీర ఊబకాయం తగ్గే ఛాన్స్‌  ఉందని వారు పేర్కొన్నారు. పుచ్చకాయ తొక్కను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇలా పుచ్చకాయ తొక్క నుంచి రసాన్ని తయారు చేయండి:

కావాల్సిన పదార్థాలు:

ఒక కప్పు పుచ్చకాయ తొక్కలో తెల్లటి భాగం, నిమ్మకాయ, మందార పువ్వు నీరు, నల్ల ఉప్పు, తేనె

చేసే విధానం:

 ముందుగా మందార పువ్వులను ఎండబెట్టాలి. ఇప్పుడు పుచ్చకాయ తొక్కలోతెల్లటి భాగంతో పాటు ఎండబెట్టిన మందార పువ్వులను కట్ చేసి మిక్సీ గ్రైండర్లో మెత్తగా రుబ్బి..అందులో తేనె, ఉప్పును కలపండి. ఇప్పుడు దీనిని క్రమం తప్పకుండా త్రాగండి.

పుచ్చకాయ తొక్క రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:

నిద్రలో మెరుగుదల:

పుచ్చకాయ తొక్కలో మెగ్నీషియం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు. రాత్రిపూట మంచి నిద్ర కోసం పుచ్చకాయ తొక్క రసం తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు నియంత్రణ:

పెరుగుతున్న శరీర బరువును నియంత్రించాలంటే పుచ్చకాయ తొక్కల రసాన్ని తాగండి. జీవక్రియను పెంచే గుణం దీనికి ఉంది. ఇది శరీరంలో పెరుగుతున్న బరువును నియంత్రించగలదు.    

చర్మం సౌందర్యం, జుట్టు కోసం..

పుచ్చకాయ తొక్కల నుంచి తయారుచేసిన జ్యూస్ బరువును తగ్గించడంతో పాటు చర్మం, జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల జట్టు సమస్యలు తొలగిపోతాయి.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది:

వేసవిలో పుచ్చకాయ తొక్క జ్యూస్ తాగడం వల్లశరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది శరీరానికి తాజా అనుభూతిని ఇస్తుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?

Also Read: PRESIDENT ELECTION: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News