/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Rahu Transit in Bharani Nakshatra 2022: గ్రహాల కదలిక ప్రతి రాశి మరియు వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాహువు జూన్ 14, 2022న రాశిని మార్చి భరణి నక్షత్రంలోకి (Rahu Transit in Bharani Nakshatra 2022) ప్రవేశించనున్నాడు. అక్కడే ఫిబ్రవరి 21, 2023 వరకు ఉంటాడు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్ర గ్రహం అనగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అని అర్థం. ఆనందం, విలాసం, వైభవం మొదలైనవన్నీ శుక్రుని ఆధీనంలో ఉంటాయి. శుక్రుడు ప్రభావం వల్ల రాహువు కూడా ఆకర్షణీయంగానే ఉంటాడు. ఈ విధంగా రాహువు, శుక్రల కలయిక కొన్ని రాశులవారిని ధనవంతులను చేస్తోంది. కొందరి ఆరోగ్యం క్షీణిస్తుంది. 

ఈ రాశులపై రాహు ప్రభావం

** మేష, లగ్న రాశి వారికి ధనం పుష్కలంగా ఉంటుంది, వారి పనులు కూడా జరుగుతాయి, ఐశ్వర్యంతోపాటు రోగాలు కూడా వస్తాయి, కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం మొదలైనవి రావచ్చు. వృషభ రాశి వారు విదేశీ యాత్రలకు వెళ్లవచ్చు, ఖర్చులతో పాటు సవాళ్లు కూడా పెరుగుతాయి, అయితే కష్టపడి పోరాడి విజయం సాధిస్తారు. షుగర్ పేషెంట్లు న్యూరో సమస్యలకు గురికావచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 

** మిథున రాశి వారికి సంపాదన బాగానే ఉంటుంది, కానీ ఆలోచించకుండా పెట్టుబడి పెడితే మోసపోవచ్చు. మరోవైపు, కర్కాటక రాశి వారికి సుఖాలు పెరుగుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది, ఇళ్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయవచ్చు. సింహ రాశికి చెందిన డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, జర్నలిజం, రచన మొదలైన వారికి ఇది మంచి సమయం. కొత్త అవకాశాలు లభిస్తాయి, దేశ విదేశాలలో దూర పర్యటనలు ఉండవచ్చు. ఆరోగ్యం క్షీణించడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. 

** కన్యా రాశి వారు ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అనవసరంగా డబ్బు వృధా అవుతుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యులకు డబ్బులు ధారపోయాలి.  ఈ రాశి వారు ఇతరుల నుండి పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు.

** తుల రాశి వ్యాపారులకు సమయం బాగానే ఉంది కానీ నెట్ వర్క్ పెంచుకుంటేనే లాభం. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సంతోషంగా గడుపుతారు. వీరికి సంపాదనతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి, కొన్ని రకాల జబ్బులు కూడా రావచ్చు. ధనుస్సు రాశి విద్యార్థులకు చదువుకోవడం, రాయడం మరియు పని చేయడం ఇష్టం ఉండదు, వారికి ఉదర సంబంధిత సమస్యలు, నోటిలో బొబ్బలు మొదలైనవి ఉండవచ్చు.

** మకరం రాశి వారికి ఈ కలయిక ప్రయోజనాలను తెస్తుంది. వీరు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ మీరు పేదలకు సహాయం చేయకపోతే, ఇంట్లో ఉంచిన డబ్బు అనారోగ్యానికే ఖర్చు చేయబడుతుంది. మనసులో ఆందోళన ఉండవచ్చు. కుంభ రాశి వారికి పనిలో యు టర్న్ లాగా మార్పు ఉంటుంది. అంటే వ్యాపారస్తులు ఉద్యోగాలు చేయడం, ఉద్యోగార్థులు వ్యాపారం చేయడం ప్రారంభిస్తారు. మీన రాశి వారికి ధనం కూడా వస్తుంది. కానీ వారు తమ మాటలను అదుపు చేసుకోకపోతే నష్టం తప్పదు. దంతాలలో సమస్య ఉండవచ్చు.

Also Read: Astrology: ఈ 5 రాశులవారు చిన్న వయస్సులోనే అపారమైన డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Section: 
English Title: 
Rahu Transit in Bharani Nakshatra on 14th June 2022: For 8 months will rain money on these zodiacs
News Source: 
Home Title: 

Rahu Transit Effect: రేపటి నుండి 8 నెలల పాటు ఈ రాశుల వారిపై ధన వర్షం!

Rahu Transit Effect: రాశిని మార్చబోతున్న రాహువు.. రేపటి నుండి 8 నెలల పాటు ఈ రాశుల వారిపై ధన వర్షం!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Rahu Transit Effect: రేపటి నుండి 8 నెలల పాటు ఈ రాశుల వారిపై ధన వర్షం!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, June 13, 2022 - 15:49
Request Count: 
95
Is Breaking News: 
No