Vikram Collections: బాక్సాఫీస్‌పై విక్ర‌మ్ దండ‌యాత్ర‌.. 10 రోజుల్లోనే 300 కోట్లు!

Vikram Box Office Collections: Vikram earns Rs 300 crore globally in 10 days. తాజాగా విక్ర‌మ్ సినిమా రూ. 300 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. కేవ‌లం 10 రోజుల్లోనే ఈ ఘ‌న‌త సాధించడం విశేషం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2022, 01:53 PM IST
  • బాక్సాఫీస్‌పై విక్ర‌మ్ దండ‌యాత్ర‌
  • 10 రోజుల్లోనే 300 కోట్లు
  • విదేశాల్లో కూడా విక్రమ్ సత్తా
Vikram Collections: బాక్సాఫీస్‌పై విక్ర‌మ్ దండ‌యాత్ర‌.. 10 రోజుల్లోనే 300 కోట్లు!

Kamal Haasan's Vikram earns Rs 300 crore globally in 10 days: సౌత్ నుంచి నార్త్‌ వ‌ర‌కు ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన 'విక్ర‌మ్' సినిమా హ‌వానే న‌డుస్తుంది. విక్ర‌మ్ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో.. బాక్సాఫీస్‌పై క‌లెక్ష‌న్ల వర్షం కురుస్తోంది. లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమాకి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన విక్ర‌మ్ చిత్రం జూన్‌ 3న విడుద‌లై పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కొన్ని సంవ‌త్స‌రాలుగా హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న క‌మ‌ల్‌కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది.

తాజాగా విక్ర‌మ్ సినిమా రూ. 300 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. కేవ‌లం 10 రోజుల్లోనే ఈ ఘ‌న‌త సాధించడం విశేషం. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో విక్ర‌మ్ ఒకటిగా నిలిచింది. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా వసూళ్లు 100 కోట్లు దాటాయి. విక్రమ్ సండే కలెక్షన్స్ 11 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గత 10 రోజుల్లో 25 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రెండవ వారంలో విక్ర‌మ్ చిత్రానికి మరింత ఆదరణ లభించింది. 

విక్రమ్ సినిమా హవా కేరళలో కూడా బాగానే ఉంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది ఆ రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కర్ణాటకలో కూడా అగ్రతానంలో ఉంది. సినీ ట్రాక్ నివేదిక ప్రకారం.. విక్రమ్ చిత్రం మొదటి వారం కలెక్షన్ దాదాపు 15 కోట్ల రూపాయలు. భారత దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా విక్రమ్ సత్తాచాటుతోంది. విక్రమ్ సినిమాకి ఇప్పుడు పోటీగా ఏదీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. 

మ్యూజిక్ సెన్షేషన్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన‌ విక్రమ్ చిత్రంలో తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక తమిళ స్టార్ సూర్య గెస్ట్ రోల్‌లో న‌టించాడు. రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ హాసన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. బిగ్ బాస్ ఫెమ్  శివాని నారాయణన్ కీలక పాత్రలో నటించింది. 

Also Read: Anushka Sharma Pregnant: చెకప్ కోసం హాస్పిటల్‌కు.. అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా?  

Also Read: IND vs SA Dream11 Prediction: అక్షర్, చహల్, అవేశ్ అవుట్.. టీమిండియా తుది జట్టు ఇదే! డ్రీమ్ ఎలెవన్ టీమ్.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News