ODI Triple Century: వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌! 140 బంతుల్లోనే

Australian Blind Cricketer Steffan Nero hits Triple Century in ODI. ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టెఫాన్ నీరో వన్డే క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 09:14 PM IST
  • వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ
  • చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌
  • 140 బంతుల్లోనే 309 పరుగులు
ODI Triple Century: వన్డేల్లో ట్రిపుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్‌! 140 బంతుల్లోనే

Australian Blind Cricketer Steffan Nero hits Triple Century in ODI: ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టెఫాన్ నీరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంధుల వన్డే క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.  కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో నీరో ఈ రికార్డు అందుకున్నాడు. ఆ మ్యాచులో కేవలం 140 బంతుల్లో 49 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల ప్రభావంతో వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేయడమే గగనమైన ప్రస్తుత రోజుల్లో ఓ అంధ క్రికెటర్‌ ట్రిపుల్‌ సాధించడం విశేషం.

అంధుల వన్డే క్రికెట్‌ చరిత్రలో ట్రిపుల్‌ సెంచరీ సాధించడంతో స్టెఫాన్ నీరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. 1998లో పాకిస్తాన్ బ్యాటర్ మసూద్ జాన్ చేసిన 262 పరుగులే అంధుల వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు టాప్‌ స్కోర్‌గా ఉండగా.. తాజాగా నీరో దాన్ని అధిగమించాడు. అంధుల వన్డే క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నీరో రికార్డులోకి ఎక్కాడు. 5 టీ20లు, 3 వన్డేల ఈ సిరీస్‌లో నీరో ఇప్పటికే రెండు సెంచరీలు (113, 101) నమోదు చేశాడు.

స్టెఫాన్ నీరో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ట్రిపుల్‌ సెంచరీ (అన్ని ఫార్మాట్లలో కలిపి) బాదిన ఎనిమిదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో మాథ్యూ హేడెన్, మైకేల్ క్లార్క్, డేవిడ్ వార్నర్, మార్క్ టేలర్, బాబ్ కౌపర్, బాబ్ సింప్సన్, డోనాల్డ్ బ్రాడ్‌మాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో ట్రిపుల్ సెంచరీలు సాధించారు. 

కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ అంధుల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో స్టెఫాన్ నీరో కేవలం 140 బంతుల్లో 309 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ఆసీస్‌ నిర్ణీత 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 542 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్‌ 272 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా 270 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కామన్‌వెల్త్‌ బ్యాంక్‌ సిరీస్  2018 నుంచి ఆరంభం అయింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 మరియు 2021లో మ్యాచ్‌లు రద్దు చేయబడ్డాయి.

Also Read: ENG vs NZ: న్యూజిలాండ్‌ జట్టులో కరోనా కలకలం.. మరో స్టార్‌ క్రికెటర్‌కు పాజిటివ్‌!

Also Read: Viral Video: నదిలో 40 మొసళ్లు చుట్టుముట్టినా.. మృత్యువు నుంచి తప్పించుకున్న సింహం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News