Singareni Job Notification 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. సింగరేణిలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

Singareni External clerks Jobs Notification 2022: తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఉద్యోగాల భర్తీపై తరచుగా ప్రకటనలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సింగరేణిలో ఎక్స్‌టర్నల్ క్లర్కుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

Last Updated : Jun 17, 2022, 02:50 AM IST
Singareni Job Notification 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. సింగరేణిలో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

Singareni External clerks Jobs Notification 2022: తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఉద్యోగాల భర్తీపై తరచుగా ప్రకటనలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సింగరేణిలో ఎక్స్‌టర్నల్ క్లర్కుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గురువారం విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కంప్యూటర్స్ / ఐటి ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికెట్ కోర్సు తప్పనిసరిగా పాసై ఉండాలని సంస్థ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇటీవలే ఇంటర్నల్ అభ్యర్థుల కోసం క్లర్కు పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించగా.. తాజా నోటిఫికేషన్ ఎక్స్‌టర్నల్ క్లర్క్ అభ్యర్థుల కోసం విడుదల చేసిందిగా సింగరేణి స్పష్టంచేసింది.

సింగరేణిలో ఖాళీలను గుర్తించి వెంటనే ఆ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ సీ అండ్ ఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకే ఈ ప్రకటన వెలువడినట్టు సింగరేణి పర్సనల్ విభాగం డైరెక్టర్ ఎన్ బలరామ్ తెలిపారు. సింగరేణి ఎక్స్‌టర్నల్ క్లర్కుల పోస్టుల వివరాల కోసం www.scclmines.com లో కెరీర్స్‌ లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరగనుంది.     

సింగరేణి ఎక్స్‌టర్నల్ క్లర్కుల పోస్టులకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు వయో పరిమితి కల్పించారు. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు లోకల్ కోటా కింద 95 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. మిగతా 5 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణలోని అందరు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్టు సింగరేణి సంస్థ వెల్లడించింది.

Also read : Bhatti Vikramarka: హైదరాబాద్‌లో రణరంగం..భట్టి విక్రమార్క, పోలీసుల మధ్య వాగ్వాదం..!

Also read : Renuka Chowdhury: పోలీసులపై రేణుకా చౌదరి చిందులు..ఎస్సై చొక్కా పట్టుకున్న నేత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News