Fish Rain: విచిత్రం... కాళేశ్వరంలో చేపల వర్షం... ఆశ్చర్యపోయిన స్థానికులు...

Fish Rain in Telangana: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది.స్థానికులు ఈ వింతను చూసి ఆశ్చర్యపోయారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 09:42 AM IST
  • భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చేపల వర్షం
  • అక్కడక్కడా నేలపై కనిపించిన చేపలు.. ఆశ్చర్యపోయిన స్థానికులు..
  • కారణమేంటో వివరించిన స్థానిక అధికారులు
Fish Rain: విచిత్రం... కాళేశ్వరంలో చేపల వర్షం... ఆశ్చర్యపోయిన స్థానికులు...

Fish Rain in Kaleshwaram: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సోమవారం (జూన్ 20) భారీ వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజాము దాకా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. చిత్రంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది. వర్షపు చినుకులతో పాటు నేలపై అక్కడక్కడా కొన్ని చేపలు పడ్డాయి. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి చేపలను ఇంతకుముందెప్పుడూ చూడలేదని అన్నారు. ఈ చేపలు ఎక్కడినుంచి వచ్చాయో.. ఎలా వచ్చి పడ్డాయో తెలియట్లేదన్నారు.

ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్లే కొంతమంది ఈ చేపలను గుర్తించారు. చేపల వర్షంపై స్థానిక అధికారులు స్పందిస్తూ.. వర్షాకాలంలో ఇలా జరగడం సహజమేనన్నారు. నదులు, చెరువులు, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడినప్పుడు...అందులోని చేపలు గాల్లోకి ఎగిరి మేఘాల్లో చిక్కుకుంటాయని చెప్పారు. మేఘాలు ఎక్కడైతే వర్షిస్తాయో.. అక్కడ అవి నేలపై పడిపోతాయని అన్నారు. అంతే తప్ప.. ఇందులో పెద్ద వింతేమీ లేదని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే, సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము దాకా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. హైదరాబాద్‌లో భారీ వర్షానికి పలుచోట్ల నీళ్లు రోడ్ల పైకి చేరాయి. కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మెహిదీపట్నం, తార్నాక, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మేయర్ విజయలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

మంగళవారం (జూన్ 21) కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్,సంగారెడ్డి, మెదక్, జనగామ, భువనగిరి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

Also Read: Modi With Defence Chief's: ఇవాళ త్రివిధ దళాధిపతులతో మోదీ కీలక భేటీ... 'అగ్నిపథ్‌'పై చర్చించనున్న ప్రధాని  

Also Read: International Yoga Day 2022: యోగాతో విశ్వ శాంతి.. మైసూర్‌ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News