Health Tips: ప్రతిరోజూ ఓట్స్ అల్పాహారమా...మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

Health Tips: ఓట్స్..ఆధునిక జీవనశైలిలో పరిచయమైన అద్భుతమైన ఆహార పదార్ధం. రోజూ మీ డైట్‌లో ఓట్స్‌ను భాగంగా చేసుకుంటే కలిగే లాభాలేంటి, మీ శరీరంలో ఏ విధమైన మార్పులొస్తాయనేది ఇప్పుడు చూద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 21, 2022, 07:38 PM IST
Health Tips: ప్రతిరోజూ ఓట్స్ అల్పాహారమా...మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా

Health Tips: ఓట్స్..ఆధునిక జీవనశైలిలో పరిచయమైన అద్భుతమైన ఆహార పదార్ధం. రోజూ మీ డైట్‌లో ఓట్స్‌ను భాగంగా చేసుకుంటే కలిగే లాభాలేంటి, మీ శరీరంలో ఏ విధమైన మార్పులొస్తాయనేది ఇప్పుడు చూద్దాం.

నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్ అనేది వైద్యులు చెప్పే మాట. ఎందుకంటే రోజులో తీసుకోవల్సిన అత్యవసర ఆహారం అది. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ సరైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి. ఫలితంగా రోజు మొత్తం ఎనర్జీను కొనసాగించడంలో దోహదపడుతుంది. అదే సమయంలో మీ శరీర బరువును కూడా తగ్గించగలగాలి. అందుకే బరువు తగ్గించగలిగే బ్రేక్‌ఫాస్ట్ ఎంచుకుంటే చాలా మంచిది. దీనికి సమాధానమే ఓట్స్. 

ఓట్స అనేది నిజంగానే సూపర్ ఫుడ్. ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువమంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటుంటారు. ఇందులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి ప్రయోజనకరం. రోజూ మీ అల్పాహారంలో ఓట్స్ భాగంగా చేసుకుంటే మీ శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. బరువు తగ్గడమే కాకుండా..రోజంతా ఎనర్జెటిక్‌గా ఉంటారు. 

ఓట్స్‌తో శరీరంలో కలిగే మార్పులు

నిండా పోషక పదార్ధాలు కలిగిన ఓట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఓట్స్‌లో ఉండే ఫైబర్ మీ బరువు తగ్గుదలకు దోహదపడుతుంది. ఓట్స్‌ను పచ్చిగా లేదా వండి ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఓట్స్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా క్రేవింగ్ నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియను పెంచుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగుపడుతుందో..చాలా వ్యాధులు దూరమౌతాయి. దాంతోపాటు ఎవర్ ఫిట్‌గా ఉంటారు. 

చర్మం కాంతివంతం

రోజూ క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకోవడం వల్ల మీ చర్మంలో చాలా కీలకమైన మార్పు వస్తుంది. ఓట్స్ తినడం వల్ల చర్మం కాంతివంతమౌతుంది. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని సజీవంగా ఉంచుతాయి. ఫలితంగా డెడ్‌స్కిన్ సెల్స్ తొలగుతాయి. దాంతో మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. 

Also read: Neem leaves Benefits: వేప ఆకులతో గుండెపోటుకు చెక్! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News