Case on RGV: రామ్‌గోపాల్‌ వర్మ కొంప ముంచిన ట్వీట్ల దురద.. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

BJP leaders files SC ans ST case against Ram Gopal Varma. రామ్‌గోపాల్‌ వర్మపై అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, నందీశ్వర్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 24, 2022, 08:22 PM IST
  • ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు
  • రామ్‌గోపాల్‌ వర్మ కొంప ముంచిన ట్వీట్ల దురద
  • ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Case on RGV: రామ్‌గోపాల్‌ వర్మ కొంప ముంచిన ట్వీట్ల దురద.. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు!

BJP leaders files SC ans ST case against Ram Gopal Varma: రామ్‌గోపాల్‌ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వర్మ.. ఇపుడు సినిమాల కన్నా వివాదాల ద్వారానే నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే వర్మ అక్కడ ఉంటారు. ఒకవేళ ఎలాంటి కాంట్రవర్సీ లేకపోతే.. తానే స్వయంగా సృష్టిస్తారు. దాంతో ఆయన సంచలనాలకు మారుపేరుగా మారారు. నిత్యం ట్వీట్స్ చేస్తూ విమర్శల పాలయ్యే వర్మ.. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కులో పడ్డారు.

ఈసారి ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించించిన విషయం తెలిసిందే. అయితే ద్రౌపది ముర్ము గురించి రామ్‌గోపాల్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలతో ట్వీట్‌ చేశారు. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు?. అంతకన్నా ముఖ్యంగా కౌరవులు ఎవరు?' అంటూ బుధవారం (జూన్‌ 22) ఓ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్మ ట్వీట్‌పై బీజేపీ నేతలు మండిపడ్డారు. ద్రౌపది ముర్మును కించపరిచేలా ట్వీట్‌ చేసిన వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

రామ్‌గోపాల్‌ వర్మపై అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, నందీశ్వర్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం వర్మపై కేసు నమోదు చేస్తామని అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారని సమాచారం తెలుస్తోంది. మరోవైపు మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

ఈ వివాదంపై ఆర్జీవీ యూ టర్న్ తీసుకున్నాడు. మరో ట్వీట్‌తో ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. తనకు ఎటువంటి దురుద్దేశం లేదని, మహాభారతంలో తనకు నచ్చిన పాత్ర ద్రౌపది అని పేర్కొన్నారు. ద్రౌపది క్యారెక్టర్‌ను గుర్తు చేయాలనే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో చూడాలి. ప్రస్తుతం కొండా మురళి, కొండా సురేఖ జీవితంపై బయోపిక్ తీసిన విషయం తెలిసిందే. 

Also Read: Karthikeya 2 Trailer: అసలు కృష్ణుడు ఏంటి.. ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి! ఆసక్తిగా 'కార్తికేయ 2' ట్రైలర్‌  

Also Read: Jos Buttler New Record: సూపర్ ఫామ్‌లో జోస్ బట్లర్..తాజాగా మరో రికార్డు బద్ధలు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News