Trending Video: రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తత చాలా అవసరం. ఏ మాత్రం పరధ్యానంగా ఉన్నా ప్రమాదాలు తప్పవు. కానీ ఈ వీడియోలో మాత్రం..ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే..లేచి డ్యాన్స్ చేయడం అక్కడున్నవారిని పిచ్చెక్కిస్తోంది.
రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. భయంకరమైన ప్రమాదానికి గురైన తరువాత కూడా లేచి నిలుచుని..రోడ్లుపై అయోమయంగా డ్యాన్స్ వేస్తున్న వీడియో ఇది. చూస్తున్నవారికి పిచ్చెక్కిస్తోంది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించక తప్పదు. ప్రమాదం చూసి ఎవరికైనా మతిపోతుంది. అంత భారీ ప్రమాదమది. కానీ ఆ వ్యక్తి వైఖరి జనానికి అర్ధం కాలేదు.
ఓ వ్యక్తి చూసుకోకుండా బైక్‌పై రోడ్డు దాటుతున్నాడు. అటుగా వస్తున్న ఓ కారు వేగంగా ఢీ కొంది. ఎగిరి అంతదూరం పడ్డాడు. అంతేకాదు..బైక్ పార్ట్స్ కూడా విరిగిపోయి రోడ్డుపై ఎగిరి పడ్డాయి. ఈ వీడియో చూస్తే ప్రమాద తీవ్రత ఎలా ఉందో మీకే తెలుస్తుంది. సాధారణంగా ఇంత వేగంగా ఢీకొడితే ఇక లేవడం కష్టం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. కానీ ఈ వీడియోలో అలా లేదు. అందుకే ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రమాదమైన వెంటనే లేచి నిలుచుని..రోడ్డుపైనే ఓ రకంగా డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు. డ్యాన్స్ చేస్తున్నాడో లేదా కరాటే పోజులిస్తున్నాడో అర్ధం కాకుండా ఉంది అతని ప్రవర్తన. కొంతమందైతే..గట్టిగా దెబ్బ తగలడం వల్ల మెదడుపై ప్రభావం చూపించి అలా ప్రవర్తిస్తున్నాడేమో అని కామెంట్ చేస్తున్నారు. కారుతో ఢీ కొట్టిన వ్యక్తికి ఇంకా పిచ్చెక్కిపోయింది ఈ పరిస్థితి చూసి.
రోడ్డుపై ఒక్కసారిగా రాంగ్ డైరెక్షన్లో బైక్‌పై వచ్చేశాడు ఆ వ్యక్తి. అట్నుంచి వేగంగా వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఈ వీడియోను ఇప్పటికే 2 మిలియన్ల కంటే ఎక్కువ వీక్షించారు. 15వేలకు పైగా టీట్వీట్స్ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.