/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Hyderabad Rains: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ వాన దంచికొడుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉన్నా..రాత్రి వేళల్లో భారీ వర్షం కురుస్తోంది. గత మూడురోజులుగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది.

దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. భారీ వర్షాలకు నాలాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉంది. దీంతో వెంటనే వరద నీటిని తొలగించే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. సమస్యాత్మాక ప్రాంతాల్లో  ప్రమాదాల నివారణకు ఈటీమ్‌ 24 గంటల పాటు పనిచేయనుంది. షిప్ట్‌ టైమింగ్ ప్రకారం సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. వరదల సమయంలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందం ప్రజలను అప్రమత్తం చేయనుంది.

ప్రధానంగా ఈబృందం జూన్ నుంచి అక్టోబర్‌ వరకు కీలక పాత్ర పోషిస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌తోపాటు మొబైల్ మాన్సూన్ బృందం, స్టాటిక్ లేబర్ టీమ్‌లను ప్రత్యేకంగా నియమించారు. ఈ బృందాలు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి..ఇళ్లల్లో చేరిన నీటిని తొలగిస్తారు. రోడ్లపై ట్రాఫిక్‌ను సైతం క్లియర్ చేస్తారని అధికారులు వెల్లడించారు. నాలాల్లో నీరు సక్రమంగా పోయేలా చర్యలు తీసుకుంటారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 168 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 64 మొబైల్ మాన్సూన్ అత్యవసర టీమ్‌, 104 ప్రత్యేక మాన్సూన్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. టీమ్‌లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం, నలుగురు కూలీలు ఉంటారు. వీరు రెండు షిఫ్ట్‌ల్లో 24 గంటలపాటు పనిచేయనున్నారు. వీటికి అదనంగా మరో 160 స్టాటిక్ లేబర్‌ టీమ్‌ను అందుబాటులో ఉంచారు జీహెచ్‌ఎంసీ అధికారులు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. 

ఎల్బీనగర్‌ జోన్‌లో 74 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. అక్కడ మొత్తం 76 మంది అధికారులను నియమించారు. చార్మినార్ జోన్‌లో 52 ప్రాంతాల్లో 32 మంది, ఖైరతాబాద్‌ జోన్‌లో 85 ప్రాంతాల్లో 81 మంది, శేరిలింగంపల్లి జోన్‌లో 52 ప్రాంతాల్లో 52 మంది అధికారులను మోహరించారు. కూకట్‌పల్లి జోన్‌లో 48 ప్రాంతాల్లో 49 మంది, సికింద్రాబాద్‌ జోన్‌లో 55 ప్రాంతాల్లో 79 మంది అధికారులను నియమించారు. 

Also read:CM Jagan on Opposition: మీ పాలనలో పిల్లల గురించి ఆలోచించారా..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ధ్వజం..!

Also read:India vs England: ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు ఎవరు..అతడికి ఈసారి అవకాశం ఉంటుందా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
hyderabad rains: ghmc set up monsoon emergency team in hyderabad
News Source: 
Home Title: 

Hyderabad Rains: హైదరాబాద్‌లో హైఅలర్ట్..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ..!

Hyderabad Rains: హైదరాబాద్‌లో హైఅలర్ట్..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ..!
Caption: 
hyderabad rains: ghmc set up monsoon emergency team in hyderabad(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

బలపడుతున్న నైరుతి రుతుపవనాలు 

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

జీహెచ్‌ఎంసీ అప్రమత్తం

Mobile Title: 
Hyderabad Rains: హైదరాబాద్‌లో హైఅలర్ట్..ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ.
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Monday, June 27, 2022 - 17:35
Request Count: 
80
Is Breaking News: 
No