Covid 19 Updates : దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత గత 24 గంటల్లో దేశంలో 11 వేల 793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సోమవారం 17 వేల 073 కేసులు నమోదు కాగా.. నిన్నటి కంటే దాదాపు 6 వేల కేసులు తగ్గాయి. అయితే మంగళవారం వచ్చే కేసుల వివరాలు ఆదివారం నాడు చేసిన టెస్టుల ఫలితాలు. ఆదివారం రోజున అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టులు తక్కువగా చేస్తారు. అందుకే మంగళవారం విడుదలయ్యే కొవిడ్ రిపోర్టులో ముందు రోజు కంటే కేసుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
గడచిన 24 గంటల్లో మరో 27 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 25 వేల 047కి పెరిగింది. గత 24 గంటల్లో కొవిడ్ నుంచి మరో 9 వేల 486 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేల 700కు పెరిగింది. దేశంలో రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. క్రియాశీల కేసుల సంఖ్య 0.22 శాతంగా కొనసాగుతోంది. దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు దరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. నిన్న 19 లక్షల 21 వేల 811 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు దేశంలో 197 కోట్ల 31 లక్షల 43 వేల 196 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
India reports 11,793 fresh COVID19 cases & 27 deaths today; Active caseload at 96,700 pic.twitter.com/mBVgmJr8be
— ANI (@ANI) June 28, 2022
READ ALSO: TS Inter Results Live Updates: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి
READ ALSO: Naga Chaitanya First Love: సమంత కంటే ముందే లవ్ స్టోరీ.. అలా బయట పెట్టిన నాగచైతన్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.