Monsoon Fruits: వర్షాకాలం వచ్చేసింది. మరికొన్ని రకాల సీజనల్ పండ్లు మార్కెట్లో రానున్నాయి. మరి వర్షాకాలం వచ్చే ఏయే పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్థులు మంచిదో తెలుసుకుందాం.
డయాబెటిస్ అనేది ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా విన్పిస్తున్న సమస్య. బ్లడ్ షుగర్ ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచాలంటే సరైన, మెరుగైన ఆహారం తీసుకోవల్సి ఉంటుంది. పంచదార, తీపి ఇతర అనారోగ్య పదార్ధాల్నించి దూరంగా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలంలో కొత్తగా కొన్ని సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి. మరి వర్షాకాలంలో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ డయాబెటిస్ రోగులు తినవచ్చా లేదా. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. వర్షాకాలం పండ్లలో ఏవి తినవచ్చు, ఏవి తినకూడదో తెలుసుకుందాం..
పియర్
పియర్ పండ్లు ఆరోగ్యానికి చాలా లాభదాయకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధ్రిగ్రస్థులు కూడా ఏ విధమైన సంకోచం లేకుండా హాయిగా తినగలిగే పండు ఇది. పియర్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీఐ అనేది 40 కంటే తక్కువే ఉంటుంది. అందుకే రోగులకు సైతం ఇది ప్రయోజనం కల్గిస్తుంది.
యాపిల్
రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచవచ్చు. అందుకే యాపిల్ ఎ డే...కీప్ డాక్టర్ ఎవే అన్నారు. వాస్తవానికి యాపిల్ సీజనల్ ఫ్రూట్ కాదు. ప్రతి సీజన్లో వస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల బరువును నియంత్రిస్తుంది. అందుకే డయాబెటిస్ రోగులకు ఇదొక డైట్‌గా ఉంది.
చెర్రీ
చెర్రీ పండ్లు వర్షాకాలంలో లభించే సీజనల్ రుచికరమైన పండు. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనకరం. ఎవరికీ హాని కల్గించదు. డయాబెటిస్ రోగులు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించేందుకు దోహదపడతాయి.
Also read: High Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి