Vikram Ott Release Date: ఎట్టకేలకు విక్రమ్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Vikram Ott Release Date Locked : విక్రమ్ సినిమాతో స్టార్ హీరో కమల్ హసన్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుందనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 05:06 PM IST
  • విక్రమ్ తో హిట్ అందుకున్న కమల్ హాసన్
  • 400 కోట్ల దిశగా పరుగులు
  • ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన
Vikram Ott Release Date: ఎట్టకేలకు విక్రమ్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడు? ఎందులో వస్తుందంటే?

Vikram on Disney+hotstar:తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు,  మలయాళ భాషలలో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు కమల్ హాసన్. కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడంతో చాలా కాలంగా ఆయన సరైన హిట్ సినిమా కోసం పరితపిస్తున్నాడు. ఆ సమయంలోనే ఖైదీ,  మాస్టర్ వంటి సినిమాలు తెరకెక్కించి,  చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ తో కలిసి విక్రమ్ అనే సినిమా చేశారు. ఆ సినిమా ప్రారంభించిన నాటి నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

సినిమాలో విజయ్ సేతుపతి,  మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ వంటి వారు కూడా నటించడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక సినిమా విడుదల అవుతున్న కొద్ది గంటల ముందు సినిమాలో సూర్య కూడా నటిస్తున్నాడు అనే విషయం క్లారిటీ ఇవ్వడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. అలా ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి చూసిన ప్రతి ఒక్కరూ విక్రమ్ సినిమా అద్భుతం అని కమల్ హాసన్ కం బ్యాక్ సినిమాలా ఉందని సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు. 

సినిమా మీద ప్రశంసల వర్షమే కాదు ఈ దెబ్బకు కలెక్షన్ల వర్షం కూడా కురుస్తోంది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతోంది. అలాగే 200 కోట్ల రూపాయల షేర్ వసూలు దిశగా పరుగులు పెడుతోంది.  ఇక సుమారు 7 కోట్ల రూపాయలకు రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేసిన నితిన్ ఆయన తండ్రి సుధాకర్ రెడ్డికి కూడా ఈ సినిమా లాభాల వర్షం కురిపించింది. సినిమా కొనుగోలు చేసిన దానికి డబుల్ అమౌంట్ ఇప్పటికే వారికి వచ్చి చేరింది. 

అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా ఎప్పుడు నుంచి అందుబాటులో ఉంటుంది అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఒక చిన్న వీడియోతో సినిమా ఎప్పటినుంచి డిజిటల్ లో అందుబాటులోకి వస్తుందనే విషయం మీద డిస్నీ ప్లస్ హాట్ స్టార్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రచారం జరుగుతున్న విధంగానే ఈ సినిమా జూలై 8వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది.

Also Read: Mahesh Babu Met Bill Gates: రియల్ శ్రీమంతుడితో మహేష్ బాబు భేటీ.. కొత్త అనుమానాలు!

Also Read: Suriya to Oscars committee: ఇది కదా సూర్య క్రేజ్ అంటే.. ఏకంగా ఆస్కార్స్ కమిటీలో సభ్యుడిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News