Cholesterol Tips: మనిషి శరీరానికి కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ నియంత్రించుకుంటే గుండె పదిలంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రణకు ప్రకృతిలో సహజసిద్ధమైన ఔషధాలు చాలా ఉన్నాయి..
ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కొలెస్ట్రాల్ ఎక్కువైతే..అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. అయితే ఇందులో ఎల్డీఎల్, హెచ్డీఎల్ అని రెండుంటాయి. ఎల్డీఎల్ అనేది శరీరానికి మంచిది కాదు. ఎల్డీఎల్ నియంత్రణలో ఉంచుకోవాలి. హెచ్డీఎల్ శరీరానికి మంచిదే. దీనివల్ల హెల్తీ సెల్స్ ఏర్పడుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఆయుర్వేదంలో చాలా ఔషధాలున్నాయి. కొన్ని రకాల వేర్లతో కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు.
కొలెస్ట్రాల్ తగ్గించుకునే మార్గాలు
వెల్లుల్లి రెమ్మల్ని ప్రతిరోజూ 2-3 బాగా నమిలి తినాలి. వెల్లుల్లితో కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా అధిక రక్తపోటు సైతం తగ్గుతుంది. వేసవికాలంలో మాత్రం వెల్లుల్లి పరిమితంగా తీసుకోవాలి. ఆవాల జ్యూస్ లేదా పౌడర్ సహాయంతో శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. ధనియా, జీలకర్ర, సోంపుతో టీ చేసుకుని తాగాలి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లేదా సోంపు జీలకర్ర కలిపి మౌత్ ఫ్రెష్నర్గా కూడా తీసుకోవచ్చు.ఇక హెర్బల్ టీలో అల్లం కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న కొవ్వు తగ్గించేందుకు పనిచేస్తుంది. రోజుకు రెండుసార్లు తాగవచ్చు.
Also read: Weight Loss Tips: ఈ పలుకులను తింటే.. పది రోజుల్లో బరువు తగ్గుతారు...!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.