ఎలుగుబంటి కంట్లో పొడిచి.. తిమింగలంతో కరిపించుకున్నాడు..!

అమెరికాకి చెందిన డైలాన్ మెక్ విలియమ్స్ అనే యువకుడు ఓ సాహస యాత్రికుడు. 

Last Updated : Apr 23, 2018, 09:22 PM IST
ఎలుగుబంటి కంట్లో పొడిచి.. తిమింగలంతో కరిపించుకున్నాడు..!
అమెరికాకి చెందిన డైలాన్ మెక్ విలియమ్స్ అనే యువకుడు ఓ సాహస యాత్రికుడు. అయితే అప్పుడప్పుడు అతను చేసే సాహసాలు అతన్ని యమద్వారం వరకూ తీసుకెళ్లి మరీ వెనక్కు తెస్తుంటాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో మూడు భారీ ప్రమాదాల నుండి బయట పడ్డారు డైలాన్. ఇటీవలే బోడీ బోర్డింగ్ చేయడానికి కవాయ్ సముద్రంలోకి వెళ్లాడు డైలాన్.
 
లోతైన సముద్రంలోకి దిగి ఈత కొడుతుండగా.. అనుకోకుండా ఒక్క పెద్ద తిమింగలం వచ్చి విరుచుకుపడింది. అతన్ని శరీరాన్ని ఎలా పెడితే అలా కరిచేసింది. అయినా డైలాన్ బతికి బట్ట కట్టడం విశేషం. రక్తమోడుతున్న శరీరంతోనే ఆయన బయటకు వచ్చాడు. ఆ తర్వాత పారామెడిక్స్‌తో ట్రీట్‌మెంట్ చేయించుకొని, కొద్ది రోజుల్లోనే మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. గత సంవత్సరం కూడా అతనికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 
 
విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ట్రైనింగ్ ఇవ్వడానికి అడవిలోకి వెళ్లిన డైలాన్ మీద ఎలుగుబంటి దాడి చేసింది. చుట్టూ ఎవరూ లేరు. అలాంటి సమయంలో అది డైలాన్ కుడిచేతిని గట్టిగా కరిచేసింది. చేసేదేమీ లేక డైలాన్ కర్రముక్కతో ఎలుగుబంటి కంటిలో పొడిచేసి.. అక్కడ నుండి బయటపడ్డాడు. అలాగే హైకింగ్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఓ కట్లపాము పొదల్లోంచి వచ్చి డైలాన్ కాలిని కరిచేసింది.
 
తొలుత ఏమవుతుందోనని భయపడినా... తన మెడికల్ కిట్ ఉపయోగించి గాయాన్ని శుభ్రంగా కడిగి.. ఆ తర్వాత యాంటీ బయోటిక్స్ వేసుకొని డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నాడు డైలాన్.  ఇలా మూడు సార్లు మృత్యు ముఖంలోకి వెళ్లి తిరిగొచ్చిన డైలాన్ ఇప్పుడు మరో యాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. సాహస యాత్రల్లో ఇవ్వన్నీ సహజం అని తెలిపారు
 

Trending News