Nupur Sharma: నుపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు..వీడియో వైరల్..వ్యక్తి అరెస్ట్..!

Nupur Sharma: బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ వివాదం సర్ధుమణగడం లేదు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉదయ్‌పూర్‌లో హత్యలకు దారి తీశాయి. ఈక్రమంలో నుపుర్‌ శర్మను బీజేపీ సస్సెండ్‌ చేసింది.

Written by - Alla Swamy | Last Updated : Jul 9, 2022, 02:35 PM IST
  • సర్దుమణగని నుపుర్ శర్మ వ్యవహారం
  • తాజాగా మరో వీడియో వైరల్
  • నిందితుడు అరెస్ట్
Nupur Sharma: నుపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు..వీడియో వైరల్..వ్యక్తి అరెస్ట్..!

Nupur Sharma: తాజాగా నుపుర్ శర్మను చంపిన వారికి రివార్డులు ఇస్తామంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడా వార్త సంచలనంగా మారింది. తాజాగా హర్యానాకు చెందిన ఓ వ్యక్తి వివాదాస్పద పోస్ట్ చేశాడు. ఆమె నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు ప్రకటించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు..నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఇటీవల అలాంటి పోస్ట్ చేసిన మరో వ్యక్తిని నుహ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదస్పద పోస్ట్‌ను హర్యానాకు చెందిన ఇర్షాద్ ప్రధాన్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టుతున్నారు. 

నిందితుడిని కోర్టులో హాజరుపర్చి..రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు కావాలనే ఇలాంటి పోస్ట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈఘటనతో హర్యానాలో ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. గతకొంతకాలంగా బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. 

మహ్మద్ ప్రవక్తపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత దీనిపై హత్యలు కొనసాగాయి. నుపుర్ శర్మ తీరుపై సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశానికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. ఈఘటన జరిగినప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. ఇటీవల కోల్‌కతాలోనూ ఆమెపై లుక్‌ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి.

Also read:Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!

Also read:Kodi Kathi Case: తెరపైకి కోడి కత్తి కేసు..సీజేఐకి నిందితుడి తల్లి లేఖ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News