8 years old boy sat roadside With Body Of 2 Year Old Brother in MP: భారత దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని అందరూ గొప్పలు చెప్పుకుంటున్నా.. కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం మనం ఎంత వెనకబడి ఉన్నామనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనీస అవసరాలు కూడా అందుబాటులో ఉండడం లేదు. దాంతో వారు రోడ్డుపై పడాల్సిన వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొరెనాలో వెలుగు చూసింది. ఓ 8 ఏళ్ల బాలుడు తన 2 ఏళ్ల సోదరుడి మృత దేహాన్ని ఒడిలో పెట్టుకుని అంబులెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బద్ ఫ్రా నివాసి అయిన పూజారామ్ జాతవ్ చిన్న కుమారుడు రాజా ఇటీవల అనారోగ్యంకు గురయ్యాడు. దాంతో అతడిని అంబాలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. రాజా పరిస్థితి విషమించడంతో అతడిని వైద్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూజారామ్ తన 8 ఏళ్ల కుమారుడు గుల్షన్‌తో కలిసి జిల్లా ఆసుపత్రికి వెళ్లాడు. రాజా రక్త హీనతతో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. వైద్యులు చికిత్స అందించినా రాజా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
రాజా శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పూజారామ్ వద్ద ఎక్కువగా డబ్బులు లేవు. అంబులెన్స్ కోసం అడగగా.. 15 వందల రూపాయల ఖర్చు అవుతుందని ప్రైవేట్ డ్రైవర్స్ చెప్పారు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో ప్రభుత్వ అంబులెన్స్ కోసం ఆసుపత్రి సిబ్బందికి వద్దకు వెళ్లాడు. ఆసుపత్రిలో అంబులెన్స్ లేదని చెప్పడంతో పూజారామ్కు ఏం చేయాలో పాలుపోలేదు. నెహ్రుపార్క్ ఎదురుగా ఉన్న డ్రైన్ వద్ద గుల్షన్ ఒడిలో రాజా శవాన్ని పెట్టి తక్కువ ధరకు వచ్చే అంబులెన్స్ కోసం బయటికి వెళ్లాడు. గుల్షాన్ తన సోదరుడి శవంతో కూర్చోడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజా శవంతో సహా గుల్షాన్ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. నెహ్రుపార్క్ దగ్గరకు వచ్చిన పూజారామ్ కుమారుడు కనపడకపోవడంతో టెన్షన్ అయ్యాడు. ఆపై విషయం తెలుసుకున్న పూజారామ్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. పోలీసుల సాయంతో పూజారామ్ తన కుమారుడి శవాన్ని అంబులెన్స్‌లో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆపై దహన సంస్కారాలు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెల్సిన అందరూ కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Also Read: Sita Ramam Poster: బక్రీద్ సందర్భంగా.. రష్మిక మందన్న ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్!
Also Read: JEE Main Result 2022: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook