Hyderabad Gun Shot: లారీ డైవర్ పై సినీ ఫక్కీలో కాల్పులు... హైదరాబాద్ లో కలకలం! దారి దోపిడీ గ్యాంగ్ పనేనా?

Hyderabad Gun Shot: హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ వద్ద శనివారం రాత్రి కాల్పుల ఘటన జరిగింది. ఐరన్‌ లోడ్‌తో  వెళ్తున్న లారీపై కారులో వచ్చిన అగంతకులు గన్ తో  కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో కాల్పుల నుంచి లారీ డ్రైవర్‌, క్లీనర్‌ త్రుటిలో సేఫయ్యారు. 

Written by - Srisailam | Last Updated : Jul 17, 2022, 09:12 AM IST
Hyderabad Gun Shot: లారీ డైవర్ పై సినీ ఫక్కీలో కాల్పులు... హైదరాబాద్ లో కలకలం!  దారి దోపిడీ గ్యాంగ్ పనేనా?

Hyderabad Gun Shot: హైదరాబాద్ శివారులో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ వద్ద శనివారం రాత్రి కాల్పుల ఘటన జరిగింది. ఐరన్‌ లోడ్‌తో  వెళ్తున్న లారీపై కారులో వచ్చిన అగంతకులు గన్ తో  కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ గురి తప్పడంతో కాల్పుల నుంచి లారీ డ్రైవర్‌, క్లీనర్‌ త్రుటిలో తప్పించుకున్నారు. బుల్లెట్లు తగిలి లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేసింది.

అవుటర్ రింగ్ రోడ్‌ నెం 14 ఎగ్జిట్‌ దగ్గర ఈ గన్ ఫైర్ జరిగింది. కారులో వెళుతున్న వ్యక్తి లారీ పక్కగా వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. లారీపై రెండు రౌండులు కాల్పులు జరిగాయి. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. దారి దోపిడీ గ్యాంగ్ పనా లేకా, వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లారీలోని ఐరన్‌ను ఎత్తుకెళ్లేందుకే దుండగులు కాల్పులకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. స్విఫ్ట్‌ కారుఎటువైపు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు మార్గంలోని అన్ని చెక్‌ పోస్ట్‌లను అలర్ట్‌ చేశారు.

Read Also: Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?

Read Also: మండపంలో అందరిముందే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. సిగ్గుతో ఏం చేశాడో చూడండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News