మరో బాంబు పేల్చిన ఫేస్‌బుక్‌ అధినేత జూకర్‌ బర్గ్‌

డేటాలీక్స్‌ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోక ముందే ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌ బర్గ్‌ మరో బాంబు పేల్చారు.

Last Updated : Apr 30, 2018, 01:16 PM IST
మరో బాంబు పేల్చిన ఫేస్‌బుక్‌ అధినేత జూకర్‌ బర్గ్‌

డేటాలీక్స్‌ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోక ముందే ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌ బర్గ్‌ మరో బాంబు పేల్చారు. మున్ముందు మరింతగా డేటా లీక్‌ అయ్యే అవకాశముందని ఫేస్‌బుక్‌ యూజర్లు, ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు అందించిన త్రైమాసిక నివేదికలో ఫేస్‌బుక్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్‌బుక్‌ ఎస్‌ఈసీకి తెలిపింది. ఇది తమ బ్రాండ్‌, వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆందోళనను వ్యక్తం చేసింది.

ఫేస్‌బుక్‌ నుంచి సేకరించిన కోట్ల మంది డేటాను కేంబ్రిడ్జ్‌ అనలిటికా లీక్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ చట్టసభలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. కేంబ్రిడ్జ్‌ అనలిటికా వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి మున్ముందు భారీ మూల్యం చెల్లించక తప్పదని తెలుస్తోంది. బ్రిటన్‌, యూఎస్‌ చట్టసభలు కంపెనీకి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.

Trending News