West Indies vs India 1st ODI : విండీస్ గడ్డపై జరిగిన థ్రిల్లింగ్ ఫైట్‌లో టీమిండియా విజయం సాధించింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. భారీ స్కోర్ చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్, మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కలిసి మొదటి వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శిఖర్ ధావన్ 10 ఫోర్లు, 3 సిక్సులతో 97 (99) పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభమన్ గిల్ (64), శ్రేయాస్ అయ్యర్ (54) పరుగులతో రాణించారు. ఈ ముగ్గురు రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 308 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో మోతీ, జోసెఫ్ చెరో రెండో వికెట్లు తీయగా.. షెషర్డ్,అకెల్ హోసేన్ తలో వికెట్ తీశారు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన విండీస్ నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ హోప్ వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ హోప్‌ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత కుదురుకున్న విండీస్ 133 పరుగుల వరకు మళ్లీ వికెట్ కోల్పోదు. ఈ దశలో శార్ధూల్ ఠాకూర్.. బ్రూక్స్ (46), కైల్ మేయర్స్ (75)లను వెంట వెంటనే పెవిలియన్ పంపించి విండీస్‌కి గట్టి షాకిచ్చాడు. అయినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన విండీస్ బ్యాట్స్‌మెన్ గట్టి పోరాట పటిమ కనబర్చారు. బ్రాండన్ కింగ్ (54), అకీల్ హోసేన్ (32),రొమారియో షెఫర్డ్ (39) పరుగులతో రాణించారు.
చివరి ఓవర్‌లో విండీస్ విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి విండీస్ బ్యాట్స్‌మెన్ షెఫర్డ్ బౌండరీ బాది ఉంటే మ్యాచ్ టై అయ్యేది. కానీ సిరాజ్ సింగిల్‌కే పరిమితం చేయడంతో విండీస్ ఓటమి ఖరారైంది. నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బ్యాట్‌తో రాణించిన కెప్టెన్ శిఖర్ ధావన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
For his captain's knock of 9⃣7⃣, @SDhawan25 bags the Player of the Match award as #TeamIndia seal a thrilling win over West Indies in the first ODI. 👌 👌 #WIvIND
Scorecard ▶️ https://t.co/tE4PtTx1bd pic.twitter.com/YsM95hV4gD
— BCCI (@BCCI) July 22, 2022
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ వర్షం.. బయటికి వెళ్లొద్దంటూ హెచ్చరికలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.