Mangal Gauri Vrat : ఇవాళ మంగళగౌరీని ఇలా పూజిస్తే.. పెళ్లి కాని అమ్మాయిలకు సద్గుణాల భర్త దొరుకుతాడు..

Mangal Gauri Vrat 2022: శ్రావణ మాసం అంటేనే పూజల మాసం అని చెప్పొచ్చు. నిత్యం శివారాధనతో పాటు ప్రతీ మంగళవారం మంగళగౌరీ వ్రతం చేస్తారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 12:31 PM IST
  • ఇవాళ రెండో మంగళగౌరీ వ్రతం..
  • మంగళగౌరీని ఎలా పూజించాలి
  • ఎలా పూజిస్తే అవివాహిత స్త్రీలకు శుభం కలుగుతుంది
Mangal Gauri Vrat : ఇవాళ మంగళగౌరీని ఇలా పూజిస్తే.. పెళ్లి కాని అమ్మాయిలకు సద్గుణాల భర్త దొరుకుతాడు..

Mangal Gauri Vrat 2022: శ్రావణ మాసంలో శివారాధనతో పాటు ప్రతీ మంగళవారం మంగళగౌరీ వ్రతం చేస్తారు. ఇవాళ శ్రావణ మాస రెండో మంగళగౌరీ వ్రతం. ఈరోజున పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరీని పూజించి ఉపవాస దీక్ష చేపడుతారు.తద్వారా ఆడపిల్లలు తాము కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారని నమ్ముతారు. మంగళగౌరీ వ్రతం నాడే శ్రావణ శివరాత్రి కూడా కావడంతో ఈరోజును మరింత పవిత్రమైనదిగా భావిస్తున్నారు. అంతేకాదు, చార్, హర్ష్ అనే రెండు శుభయోగాలు కూడా ఇదే రోజున ఏర్పడుతున్నాయి. దీంతో ఇవాళ మంగళగౌరీ వ్రతం చేసేవారికి రెట్టింపు ఫలితాలు ఉంటాయని విశ్వసిస్తున్నారు.

మంగళ గౌరీ శీఘ్ర పూజా విధానం :

మంగళగౌరీ వ్రతం రోజున ఉదయాన్నే స్నానమాచరించాలి. ఎరుపు లేదా ఆకుపచ్చ దుస్తులు ధరించండి. శుభ ముహూర్త సమయంలో శివపార్వతులను పూజించాలి. పూజ సందర్భంగా కుంకుమ, అక్షితలను దేవీ దేవతల చిత్రపటాల వద్ద ఉంచండి. పండ్లు, స్వీట్లు, నైవేద్యం పెట్టండి. మనసులోని మీ కోర్కెను దేవీ దేవతలకు చెప్పండి. సాయంత్రం తర్వాత ఉపవాస దీక్షను వీడి సాత్విక ఆహారం తీసుకోండి.

మంగళగౌరీ లేదా పార్వతి ఆర్తి :

గిరిరాజ తనయ - శ్రీ గణ నాయకుని
తల్లి గౌరీ పార్వతి - గరళ కంట్టు రాణి
అవతార విన్నపం -అంబికా దేవికీ
కొమరోప్పుచున్న మంగళా గౌరికీ
జయ మంగళం -నిత్య శుభ మంగళం
తపసుని రంభకు--తగు మనసు జన్మించి
సగము దేహము గొన్న శార్వాణికీ
తగు రూపులగు వారు- త్రిపుర సుందరు లైన
త్రైలోక్య మంగళా గౌరమ్మకు
జయ మంగళం-నిత్య శుభ మంగళం
ఐదు ముహూర్తాలు -ఐదు ఘడియలు
ఐదు నెలలోపల--ఐదు మిము గొల్తు
లడ్డు వమ్ములు -మోద కాయలు
పేరినా నేతులు శార్వాణికీ
జయ మంగళం-నిత్య శుభ మంగళం

జై పార్వతి మాతా,
జై పార్వతి మాతా
బ్రహ్మ సనాతన్ దేవి,
శుభ ఫలాన్ని ఇచ్చే దైవం

ఈ మంత్రాన్ని ఉఛ్చరిస్తూ మంగళగౌరీని పూజించాలి. తద్వారా ఆ దేవీ అనుగ్రహం కలుగుతుంది. మంగళగౌరీ అనుగ్రహం కలిగిన వివాహిత స్త్రీల దాంపత్య జీవితం అన్నివిధాలుగా సకల సౌక్యాలతో సాగుతుంది. పెళ్లికాని అమ్మాయిలకు సద్గుణాలు కలిగిన అబ్బాయి జీవిత భాగస్వామిగా దొరుకుతాడు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: AP EAMCET Results 2022: మరికాసేపట్లో ఈఏపీసెట్ ఫలితాలు.. విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి..  

Also Read: Raksha Bandhan 2022: సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్లే ఎందుకు వేయాలి? దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News