Skin Care Tips: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు పొంచి ఉంటాయి. వర్షాకాలంలో చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోకపోతే..చర్మవ్యాధులతో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
చర్మ సంరక్షణకు వర్షాకాలంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చర్మ సంబంధిత వ్యాధులు వర్షాకాలంలోనే ఎక్కువగా వస్తుంటాయి. వర్షపు నీరు, కలుషిత వాతావరణం, కలుషిత నీరు కారణంగా చర్మ సంబంధిత రోగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వర్షాకాలంలో చర్మం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా శుభ్రత ఎక్కువగా పాటించాలి. లేకపోతే ఇన్‌ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. చర్మం దద్దుర్లు రావడం, మచ్చలు ఏర్పడటం, ఎగ్జిమా వంటి సమస్యలు ఏర్పడతాయి.
వర్షాకాలంలో గోరు వెచ్చని నీళ్లతో తరచూ ముఖం, చేతులు, కాళ్లు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. బయట్నించి వచ్చిన వెంటనే తప్పకుండా ఈ పని చేయడం అలవాటు చేసుకోవాలి. గోర్లు ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేట్టు చూసుకోవాలి. చర్మంపై ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కొబ్బరి నూనె రాస్తుండాలి. కొబ్బరి నూనె బ్యాక్టిరియల్ ఇన్‌ఫెక్షన్లు దరిచేరకుండా చేస్తుంది. అదే సమయంలో వర్షకాలంలో దోమకాటు వల్ల కూడా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీ పరిసరాల్లో శుభ్రత పాటించాలి. దోమల్లేకుండా చూసుకోవాలి.
వేసవిలోనే కాదు..వర్షాకాలంలో కూడా చర్మం హైడ్రైట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. అంటే చర్మానికి తగిన తేమ ఎప్పుడూ అవసరమే. చర్మం హైడ్రేట్‌గా లేకపోతే బ్లాక్ హెడ్స్, డ్రై స్కిన్ సమస్యలు ఎదురౌతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగడమే కాకుండా స్కిన్ లోషన్ రాస్తుండాలి.
Also read: Coconut Benefits: కొబ్బరినీళ్లతో కలిగే అద్బుత ప్రయోజనాలు, బరువు తగ్గేందుకు కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.