Heart Attack vs Chest Pain: ఆరోగ్యంగా, పిట్‌గా ఉంటే ఏ విధమైన సమస్యలు దరిచేరవు. ఒక్కోసారి కొన్ని ప్రమాదకర వ్యాధుల లక్షణాలు ముందుగానే వస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
మన శరీరంలో ఒక్కోసారి ఒక్కొక్క భాగంలో నొప్పి అనేది వస్తుంటుంది. తలనొప్పి, కాళ్ల నొప్పి, బ్యాక్ పెయిన్, ఛాతీలో నొప్పి, కడుపు నొప్పి ఇలా ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. ఇలాంటి నొప్పులన్నీ ఏదో ఒక రోగానికి సంకేతమంటున్నారు వైద్యులు. అందుకే ఏ చిన్న సమస్య అన్పించినా నిర్లక్ష్యం వద్దంటున్నారు. ముఖ్యంగా ఛాతీలో తరచూ వచ్చే నొప్పిని చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. ఇది ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకు..కారణాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాతీలో నొప్పంటే..ఈ ముప్పు పొంచి ఉన్నట్టే
యాంజినా అనేది ఛాతీలో నొప్పిలాంటిదే. ఇది కచ్చితంగా గుండె వ్యాధికి సంకేతం కావచ్చు. యాంజినా నొప్పి..ఛాతీ నొప్పితో పోలిస్తే కాస్త తీవ్రంగా ఉండవచ్చు. గుండెకు సంబంధించిన సమస్యైతే మాత్రం యాంజినా సమస్య ఎదురౌతుంది. అదే సమయంలో యాంజినా సమస్య కూడా రెండు రకాలుగా ఉంటుంది. స్థిరమైన యాంజినా, అస్థిరమైన యాంజినా. స్థిరమైన యాంజినాలో మీ గుండె రక్తాన్ని వేగంగా సరఫరా చేయిస్తుంది. అదే అస్థిరమైన యాంజినాలో..రక్త సరఫరాలో ఇబ్బంది ఉన్నప్పుడు వస్తుంది. ఫలితంగా గుండెనొప్పి రావచ్చు.
హార్ట్ ఎటాక్
హార్ట్ ఎటాక్ వచ్చేముందు ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా హఠాత్తుగా ఛాతీలో నొప్పి ఉన్నప్పుడు సాధారణ సమస్యగా తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే హార్ట్ ఎటాక్ సమస్య ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి తప్పకుండా వస్తుంది. హార్ట్ ఇన్ ఫెక్షన్ సమస్యలో కూడా ఛాతీలో నొప్పి వస్తుంటుంది. గుండెలో సాధారణంగా వైరల్ బ్యాక్టీరియల్ కారణంగా మయోకార్డిటిస్ సమస్య ఉండవచ్చు. ఫలితంగా ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అందుకే ఛాతీ నొప్పిని ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
Also read: Kidney Health: మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడు డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి