JANMASHTAMI 2022: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున చిన్నికృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజునే (Sri Krishna Janmashtami 2022) శ్రీ కృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ సంవత్సరం జన్మాష్టమి పండుగను భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి జన్మాష్టమి ఆగస్టు 18, గురువారం వస్తోంది. ఈ రోజున శ్రీ కృష్ణుని ఆశీస్సులు పొందడానికి... ఈ ముఖ్యమైన వస్తువులు షాపింగ్ చేయండి.
ఈ వస్తువులు షాపింగ్ చేయండి
ఆవు లేదా దూడ - శ్రీ కృష్ణుడికి ఆవులు మరియు దూడలంటే చాలా ఇష్టం. అందుకే జన్మాష్టమి రోజున ఆవు లేదా దూడ బొమ్మను కొని గుడిలో ఉంచడం వల్ల సంతానం కలుగుతుంది.
వేణువు- కృష్ణుడికి వేణువుకు గల సంబంధించిన మనందరికీ తెలిసిందే. అందుకే ఈ రోజున శ్రీ కృష్ణుడికి వెండి వేణువును నైవేద్యంగా సమర్పించడం వల్ల వారి ఇంట్లో పేదరికం అనేది ఉండదు. ఈ వేణువును మీరు ఎక్కడైతే డబ్బు ఉంచుతారో ఆ స్థానంలో ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది.
శంఖం - పురాణాల ప్రకారం, శంఖం లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారమని చెబుతారు. ఈ రోజున శంఖంతో గోపాలుడికి అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు. శంఖం యెుక్క ధ్వని మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేస్తుందని నమ్ముతారు.
నెమలి ఫించం- జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణ భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన వస్తువులు కొంటారు. అటువంటి వస్తువుల్లో నెమలి ఫించం ఒకటి. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజున నెమలి ఫించంను ఇంట్లో ఉంచుకుంటే దుష్ట శక్తులు అంతమవుతాయని నమ్ముతారు. అలాగే ఇంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేనా మీ జాతకంలో కాలసర్పదోషం కూడా పోతుంది.
వైజయంతీ మాల- గ్రంధాల ప్రకారం, శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడూ తన మెడలో వైజయంతీ మాలను ధరిస్తాడు. ఈ రోజున వైజయంతీ మాలను ఇంటికి తీసుకువస్తే.. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నమ్ముతారు.
Also Read: Sai Baba: సాయిబాబా చెప్పిన ఈ 11 మాటలను పాటిస్తే.. మీ జీవితం ఆనందమయం అవుతుంది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook