Tiger Bird Video: పులినే ఆటాడించిన పక్షి.. వీడియో చూస్తే అబ్బా అనకుండా ఉండలేరు!

Tiger Bird Funny Video, Bird teased Tiger in water. ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పులి మరియు పక్షి మధ్య జరిగే పోరాటానికి సంబంధించినది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 29, 2022, 09:51 PM IST
  • పులినే ఆటాడించిన పక్షి
  • వీడియో చూస్తే అబ్బా అనకుండా ఉండలేరు
  • వీడియోకు కామెంట్ల వర్షం
Tiger Bird Video: పులినే ఆటాడించిన పక్షి.. వీడియో చూస్తే అబ్బా అనకుండా ఉండలేరు!

Tiger Bird Funny Video, Bird teased Tiger in water: పులి అడవిలో అత్యంత ప్రమాదకరమైన జంతువు అన్న విషయం తెలిసిందే. పులి బలం, ధైర్యం అంతాఇంతా కాదు. అడవిలో దాని ముందు సింహం తప్ప ఏ ఇతర జంతువు నిలబడలేదు. పులి ఎంతో చురుకుగా ఉటుందన్న విషయం తెలిసిందే. అలాంటి పులిని మనం దూరం నుంచి చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక అది మనవైపు చూసిందంటే వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెడతాం. అలాంటి పులిని ఓ పక్షి ఆటాడుకుంది. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న గొయ్యిలో చిన్న పక్షి ఉంటుంది. దీన్ని చూసిన పెద్ద పులి.. పక్షిని పట్టుకోవడానికి గొయ్యిలోకి దూకుతుంది. దాంతో నీటిలో మునిగిన పక్షి నేరుగా పులి వెనకాల తేలుతుంది. పులి వెనక్కి తిరిగిన వెంటనే.. అది నీటిలోకి మునుగుతుంది. ఇలా చాలా సార్లు చేస్తుంది. దాంతో పక్షిని పులి పట్టుకోలేకపోయింది. తెలివైన పక్షి ఇలా ట్రిక్కులు చూపి తన ప్రాణాలను కాపాడుకుంది. పక్షి తెలివి మరియు చురుకుదనం ముందు టైగర్ నిస్సహాయంగా కనిపిస్తుంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 🐾 IFELINES ~ (@feline.unity)

పులి, పక్షికి సంబందించిన వీడీయోను 'ఫిఫైల్.యూనిటీ' అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 46 వేలకు పైగా వ్యూస్ రాగా.. వేళల్లో రీట్వీట్ వచ్చాయి. మరోవైపు ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. 'తెలివైన పక్షి', 'సూపర్ బర్డ్' అంటూ కెమెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Ramarao on duty: పవిత్ర లోకేష్ కనిపించగానే థియేటర్లలో గోలగోల.. మాములు రచ్చ కాదుగా!

Also Read: GodFather Update: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

 

Trending News