Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు గంగూలీ మళ్లీ మైదానంలో అడుగు పెట్టబోతున్నారు. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. 

Written by - Alla Swamy | Last Updated : Jul 31, 2022, 07:05 PM IST
  • గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్‌
  • త్వరలో బ్యాట్ పట్టనున్న దాదా
  • వెల్లడించిన బీసీసీఐ చీఫ్
Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!

Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్‌ అందింది. త్వరలో ఆయన బ్యాట్‌ పట్టనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆ తర్వాత ఒకటి, రెండు ఛారిటీ మ్యాచ్‌ల్లో గంగూలీ కనిపించారు. త్వరలో ప్రారంభంకానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌(LLC)లో ఆడనున్నారు. ఈఏడాది సెప్టెంబర్‌లో ఈలీగ్ ప్రారంభం అవుతుంది.

ఈసీజన్‌లో గంగూలీ బ్యాట్ పట్టి తన అభిమానులను అలరించనున్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మహిళా సంక్షేమం కోసం లెజెండ్స్ లీగ్ జరగనుంది. ఈమ్యాచ్‌ల ద్వారా నిధులు వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. త్వరలో లెజెండ్స్‌తో తాను క్రికెట్ ఆడబోతున్నానని వెల్లడించారు. ఇందు కోసం జిమ్‌లో కుస్తి పడుతున్నానని చెప్పారు.

ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కెప్టెన్‌గా టీమిండియాకు గంగూలీ ఎన్నో విజయాలను అందించారు. యువరాజ్‌, కైఫ్‌, రైనా, పఠాన్, ధోనీ వంటి ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌ పరిచయం చేసిన ఘనతను సాధించారు. టీమిండియా తరపున గంగూలీ 113 టెస్ట్‌ మ్యాచ్‌లు, 311 వన్డేలు ఆడారు. రెండు ఫార్మాట్లలో దాదాపు 20 వేల పరుగుల చేశారు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. 

Also read:August 1st: రేపటి నుంచి అమలుకానున్న కొత్త నిబంధనలు..స్పెషల్ స్టోరీ..!

Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News