HDFC Interest Rates: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5-10 బేసిస్ పాయింట్లు పెంచడంతో కస్టమర్లకు షాక్ తగలనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఇది కచ్చితంగా షాకింగ్ న్యూస్. దేశంలోని ప్రైవేటు బ్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న హెచ్‌డిఎఫ్‌సి..అన్ని రకాల రుణాల వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల రుణాల టెన్యూర్స్‌పై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ ల్యాండింగ్ రేట్ అంటే ఎంసీఎల్ఆర్‌ను 5-10 బేసిస్ పాయింట్లకు పెంచింది. దీని ప్రభావం రుణ గ్రహీతల ఈఎంఐలపై పడనుంది.
ఈ పెంపు ఇవాళ్టి నుంచి అంటే ఆగస్టు 8వ తేదీ 2022 నుంచి అమలు కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటులో 0.50 శాతం పెంచిన నేపధ్యంలో హెచ్‌డిఎఫ్‌సి ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో ఆర్బీఐ ఎంపీసీ భేటీలో ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆగస్టు 5వ తేదీ శుక్రవారం నాడు భేటీ వివరాల్ని వెల్లడించారు. ఆ సమయంలో రెపో రేటును 0.50 శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. దాంతో రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. రెపో రేటును పెంచడం వరుసగా ఇది మూడవసారి.
ఆర్బీఐ రెపో రేటు పెంచడం మూడవసారి
ఇంతకుముందు ఆర్బీఐ 2022 మే నెలలో ఒకేసారి రెపో రేటును 0.50 శాతానికి పెంచింది. ఆ తరువాత జూన్ నెలలో రెండవసారి 0.40 శాతం పెంచింది. మే నుంచి అపపటి వరకూ రెపో రేటు 1.40 శాతం పెరిగింది. ఫలితం హోమ్‌లోన్స్, కార్‌లోన్స్, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు అన్నీ భారంగా మారిపోయాయి.
Also read: Gpay Cashback: గూగుల్ పేలో క్యాష్‌బ్యాక్ రావడం లేదా..ఇలా చేస్తే క్యాష్‌బ్యాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook