Raksha Bandhan Gift ideas: రాఖీ పండగకు తక్కువ బడ్జెట్‌లో అక్కా, చెల్లెళ్లకు ఇచ్చేందుకు బెస్ట్ గిఫ్ట్స్

Raksha Bandhan Gift ideas: రక్షా బంధన్.. రాఖీ పండగ.. భాష ఏదైనా.. పిలుచుకునే పేరేదైనా.. ఈ పండగకు ఉన్న ప్రత్యేకత మాత్రం చాలా గొప్పదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుల, మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వాళ్లు జరుపుకునే అతి కొద్ది పండగల్లో అతి ముఖ్యమైనది ఈ రాఖీ పండగ.

Written by - Pavan | Last Updated : Aug 10, 2022, 07:08 PM IST
Raksha Bandhan Gift ideas: రాఖీ పండగకు తక్కువ బడ్జెట్‌లో అక్కా, చెల్లెళ్లకు ఇచ్చేందుకు బెస్ట్ గిఫ్ట్స్

Raksha Bandhan Gift ideas: రక్షా బంధన్.. రాఖీ పండగ.. భాష ఏదైనా.. పిలుచుకునే పేరేదైనా.. ఈ పండగకు ఉన్న ప్రత్యేకత మాత్రం చాలా గొప్పదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కుల, మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వాళ్లు జరుపుకునే అతి కొద్ది పండగల్లో అతి ముఖ్యమైనది ఈ రాఖీ పండగ. సోదర, సోదరి భావంతో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు ఆనందంగా, ఎంతో వేడుకగా జరుపుకునే ఈ పర్వదినం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. 

దూరం, భారం అనకుండా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లను ఒక్క చోట చేర్చే పండగ ఇది. అన్నయ్యకు రాఖీ కట్టాలని చెల్లెళ్లు.. సోదరితో రాఖీ కట్టించుకోవాలని సోదరులు వేచిచూసే ఆ క్షణం.. నాకు నువ్వు.. నీకు నేను.. నీ ప్రతీ కష్టంలో, నీ ప్రతీ ఆనందంలో నీకు తోడుంటానంటూ కళ్లతోనే సోదరుడు, సోదరికి ఇచ్చే భరోసా.. ఆ సమయంలో ఒకరి కళ్లలో మరొకరికి కనిపించే ఆనందం.. ఊహకందని మధుర క్షణాలవి. సోదరుడికి రాఖీ కట్టలేని రోజు ఆ సోదరి పడే వేదన కూడా అంతే వర్ణనాతీతం. 

కుల, మతాలకు అతీతంగా సోదర-సోదరి భావంతో వేడుకగా జరుపుకునే ఈ రాఖీ పండగ నాడు సోదరికి ఏం బహుమతి ఇవ్వాలా అని ఆలోచించని సోదరుడు ఉండడు. ఆర్థికంగా తనకు ఉన్నంతలో, తనకు కలిగినంతలో.. తన సోదరిని ఆనందపెట్టే కానుక ఏదైనా ఇవ్వాలని ప్రతీ సోదరుడు కోరుకుంటాడు. 

ఇక్కడ చాలామందికి వచ్చిన చిక్కేంటంటే.. నీకు ఏం గిఫ్ట్ కావాలి అని సోదరిని అడగలేరు. ఎందుకంటే.. అలా అడిగి కొనిచ్చే బహుమతి ఆనందాన్ని ఇస్తుందేమో కానీ కచ్చితంగా సర్‌ప్రైజ్‌ని మాత్రం ఇవ్వలేదు. అలాంటప్పుడు మరి ఏం గిఫ్ట్ కొనిస్తే బాగుంటుందనే ఆలోచనే చాలామందిని సతమతం చేస్తుంటుంది. అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్.

Happy-Raksha-Bandhan-wishes-2022-Happy-Raksha-Bandhan-greetings-cheap-and-best-gifts-for-Raksha-Bandhan-2022.jpg

స్మార్ట్ వాచ్: ప్రస్తుతం అంతా స్మార్ట్‌వాచ్‌ల జమానా నడుస్తోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎంత మామూలైపోయిందో.. చేతికి స్మార్ట్‌వాచ్ కూడా అంతే కామన్ అయిపోయింది. టైమ్ చూసుకోవడంతో పాటు బీపీ, పల్స్‌రేట్ మానిటరింగ్ లాంటి హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు అలారం, రిమైండర్స్ ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. 

Happy-Raksha-Bandhan-wishes-Happy-Raksha-Bandhan-greetings-cheap-and-best-gifts-for-Raksha-Bandhan.jpg

హెడ్‌ఫోన్స్: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌తో పాటు విరివిగా ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో హెడ్ ఫోన్స్ కూడా ఒకటి. పని చేసేటప్పుడైనా, గ్రౌండ్‌లో జాగింగ్ చేసేటప్పుడైనా.. సరదాగా సినిమా చూసేటప్పుడయినా లేదా నచ్చిన ట్రాక్స్ వినాలన్నా హెడ్ ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కనుక అలాంటి గిఫ్ట్ ఏదైనా ఇస్తే అవి ఉపయోగించే ప్రతీసారి మీరు వాళ్లకు గుర్తుకురావడం ఖాయం.

Happy-Raksha-Bandhan-wishes-Happy-Rakhi-festival-greetings-cheap-and-best-gifts-for-Raksha-Bandhan-2022.jpg

స్కిన్ కేర్ ప్రోడక్ట్స్: బంగారు ఆభరణాలకు సమానంగా లేడీస్ ప్రాధాన్యత ఇచ్చేది మరొకటి ఏదైనా ఉందా అంటే చర్మ సౌందర్యమే అంటుంటారు. కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ బిజినెస్ గణాంకాలు చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అందుకే మీ సోదరి చర్మాన్ని రక్షించే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవైనా బహుమతిగా అందివ్వండి.

Happy-Raksha-Bandhan-wishes-Happy-Rakhi-greetings-cheap-and-best-gifts-for-Raksha-Bandhan-2022.jpg

మేకప్ కిట్: అమ్మాయిలను, మేకప్ ను వేర్వేరుగా చూడలేం అని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చిచెప్పేశాయి. ఇంటర్నెట్ లో బ్రౌజింగ్ చేసే అమ్మాయిల్లో ఎక్కువ శాతం మంది మార్కెట్లోకి కొత్తగా వచ్చే మేకప్ ప్రోడక్ట్స్ కోసం ఇంటర్నెట్‌ని జల్లెడ పడుతుంటారని గతంలోనే ఓ సర్వేలో తేలింది. అందుకే వారిని ఆకట్టుకునేలా ఓ మేకప్ కిట్ కొని బహుమతిగా అందివ్వండి.

Happy-Raksha-Bandhan-wishes-Happy-Raksha-Bandhan-greetings-cheap-and-best-gifts-for-Raksha-Bandhan-2022.jpg

జువెలరీ: అమ్మాయిలకైనా.. అమ్మలకయినా.. వయస్సుతో నిమిత్తం లేకుండా లేడీస్‌కి జువెలరీ అంటే ఎంతో ఇష్టం. ఇది ఎవ్వరూ కాదనలేని విషయం. ఎప్పటికప్పుడు పెరుగుతున్న బంగారం ధరలు, వెండి ధరలే అందుకు నిదర్శనం. అందుకే, ఏ బహుమతి కొనాలో అర్థం కానట్టయితే.. అందమైన నెక్లెస్, చెవి రింగులు, రింగ్స్ ఇలా ఏది తీసుకున్నా వాళ్ల ముఖంలో ఆనందం చూడటం గ్యారెంటీ అనే బలమైన అభిప్రాయం ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మధ్య, దిగువ తరగతి వారికి ఇది కొంచెం ఖరీదైన వ్యవహారమే. కాకపోతే సోదరి ముఖంలో ఆనందం చూడాలనుకుంటే ఇలాంటివి తప్పదు కదా మరి. 

Also Read : Raksha Bandhan Mehendi Designs: రక్షాబంధన్ సందర్భంగా మీ చేతులను గోరింటాకుతో అలంకరించుకోండి..డిజైన్లు ఇవే

Aso Read : Soda Water Benefits: బయట్నించి వస్తూనే సోడాతో ముఖం కడిగి చూడండి, అద్భుతమైన ఫ్రెష్‌నెస్, నిగారింపు మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News