7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు ఉంటుందన్న విషయం తెలిసిందే. 2022లో మొదటి డీఏ పెంపు జనవరి నుంచే అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచడంతో.. ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అందుతోంది. ఇక రెండో డీఏ ఎప్పుడనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే డీఏ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. సెప్టెంబర్ 28న అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
ఉద్యోగుల డీఏ ఎంత పెరుగుతుందనే దాని కోసం కేంద్ర ప్రభుత్వం AICPI-IW (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్) ఇండెక్స్ డేటాను ఉపయోగిస్తుంది. జూన్‌లో సూచీ 129.2కి చేరింది. ఇండెక్స్ పెరగడం వల్ల డీఏలో 4 శాతం పెరగడం ఖాయం. ఈ పెంపుతో కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. పెరిగిన డీఏ సెప్టెంబర్ జీతంతో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూలై, ఆగస్టుకు సంబంధించిన డీఏ బకాయిల ప్రయోజనాన్ని కూడా ఉద్యోగులు, పెన్షనర్లు సెప్టెంబర్ మాసంలో పొందుతారు.
డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచిన తర్వాత కేంద్ర ఉద్యోగుల డీఏ మొత్తంగా 38 శాతానికి పెరుగుతుంది. పెరిగిన డీఏ సెప్టెంబర్ 2022 జీతంలో ఉద్యోగులు పొందుతారు. కొత్త డీఏ జూలై 1 2022 నుండి వర్తిస్తుంది. కాబట్టి జూలై, ఆగస్టు నెలల డీఏ బకాయిలు కూడా సెప్టెంబర్ నెలలో ఉద్యోగుల జేబుల్లో చేరనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం 34 శాతం డియర్‌నెస్ అలవెన్స్ ఇస్తోంది. 4 శాతం డీఏతో కనీస మరియు గరిష్ట బేసిక్ జీతం ఎంత పెరుగుతుందో ఓసారి చూద్దాం.
గరిష్ట బేసిక్ జీతం:
1. ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 56,900
2. కొత్త డీఏ (38%) రూ. 21,622/నెలకు
3. డీఏ ఇప్పటివరకు (34%) రూ. 19,346/నెలకు
4. డీఏ 21,622-19,346 = రూ 2260/నెలకు
5. వార్షిక వేతనం 2260 X12 = రూ 27,120 పెంపు
కనీస బేసిక్ జీతం:
1. ఉద్యోగి బేసిక్ వేతనం రూ.18,000
2. కొత్త బేసిక్ (38%) రూ. 6840/నెలకు
3. డీఏ ఇప్పటివరకు (34%) రూ. 6120/నెలకు
4. డీఏ ఎంత పెరిగింది 6840-6120 = రూ.720/నెలకు
5. వార్షిక వేతనం 720X12 = రూ. 8640 పెంపు
Also Read: మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే
Also Read: సడెన్ సర్‌ప్రైజ్.. విజయ్ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్ అయిపొయింది! పాపం రష్మిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్‌డేట్! దసరాకు భారీగా డబ్బులు
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
డీఏ పెంపుపై కీలక అప్‌డేట్
దసరాకు భారీగా డబ్బులు