Type 2 Diabetes Control By Diet: వెల్లుల్లి వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రోటీన్లు లభిస్తాయి. వీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తినడం వల్ల వచ్చే లాభాలు అన్నో ఇన్నో కావు. ఇందులో ఉండే మూలకాలు రక్తాన్ని శుభ్రం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాలను నియంత్రించి రక్తనాళాలు ఒత్తిడిని తగ్గించేందుకు కృషి చేస్తాయి. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వీటిని ఉదయం పూట పొట్టు తీసి ఖాళీ కడుపుతో నమలడం వల్ల మెదడులో సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెంచుకోవాలనుకునేవారు వీటిని తప్పకుండా ఉదయం పూట తీసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా పరిస్థితుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వీరికి ఈ చిట్కా ప్రభావంతంగా పనిచేస్తుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని దంచి.. అందులో రసాన్ని తీసి తేనెలో కలుపుకొని తాగితే శరీరానికి ప్రయోజనాలు లభించడం కాకుండా.. దగ్గు, జలుబు, కపం వంటి సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇది చర్మంపై కూడా ప్రభావంతంగా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇందులో ఉండే మూలకాలు చర్మంపై వ్యాధులను నియంత్రించేందుకు ప్రభావంతంగా పనిచేస్తాయి. చర్మం పై అలర్జీ, గజ్జి, తామర వంటి వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు తెలుపుతున్నాను. ముఖ్యంగా వెల్లుల్లి రెబ్బలతో తేనెను కలుపుకొని తీసుకుంటే అది దీర్నాక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించి.. వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
చెడు కొలస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి.. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు.. తప్పకుండా ఈ వెల్లుల్లి తేనే మిశ్రమాన్ని తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహం సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఈ మిశ్రమం పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా సులభంగా నియంత్రిస్తుంది. కావున సులభంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులో యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అందుకే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook