Bhadrapad Shivratri 2022: భాద్రపద శివరాత్రి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి

Bhadrapad Shivratri 2022: భాద్రపద శివరాత్రి ఉపవాసం 25 ఆగస్టు 2022న జరుపుకోనున్నారు. భాద్రపద శివరాత్రి ముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 24, 2022, 07:04 PM IST
Bhadrapad Shivratri 2022: భాద్రపద శివరాత్రి ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజ విధానం తెలుసుకోండి

Bhadrapad Shivratri 2022: ప్రతి నెల కృష్ణ పక్షం చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి జరుపుకుంటారు. భోలేనాథ్‌కు శివరాత్రి చాలా ప్రీతికరమైనది. ఈ ఏడాది భాద్రపద శివరాత్రి (Lord Shiva) 25 ఆగస్టు 2022 నాడు వస్తుంది. ఈ శివరాత్రి నాడు పార్వతీపరమేశ్వరులను పూజించడం వల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మహిళలు అఖండ సౌభాగ్యం కోసం ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. భాద్రపద శివరాత్రి ముహూర్తం, పూజ విధానం గురించి తెలుసుకుందాం. 

భాద్రపద శివరాత్రి 2022 ముహూర్తం
భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి 25 ఆగస్టు 2022 ఉదయం 10.37 గంటలకు ప్రారంభమై... 26 ఆగస్టు 2022 మధ్యాహ్నం 12.23 గంటలకు ముగుస్తుంది. 
శివపూజ ముహూర్తం - 25 ఆగస్టు 2022, మధ్యాహ్నం 12.01 - 12.45 వరకు
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04.34  -  05.18 
అభిజిత్ ముహూర్తం - మధ్యాహ్నాం 12.03 - 12.54 
సంధ్య ముహూర్తం - సాయంత్రం 06.42 - 07.06 
అమృత కాలం - ఉదయం 09.10- ఉదయం 10.57 

భాద్రపద శివరాత్రి పూజ విధానం 
భాద్రపద మాస శివరాత్రి గురువారం వస్తుంది. ఈరోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయండి. ఉపవాస దీక్ష తీసుకోండి. అనంతరం గంగాజలంతో శివుడికి అభిషేకం చేయండి. తర్వాత మహాదేవుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేయండి. శివయ్యతోపాటు పార్వతీమాతను పూజించండి. శివునికి బిల్వపత్రం, దాతుర, భాగం, భస్మ, అంకు మొదలైన పుష్పాలను, పార్వతీదేవికి మేకప్ వస్తువులను సమర్పించండి. పూజ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. దీపం పెట్టి ధూపం వేయండి. శివచాలీసాను పఠించండి. చివరగా  హారతి ఇవ్వండి. ఈ శివరాత్రి రోజు పూజలు చేయడం వల్ల మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also Read: 1500 ఏళ్ల తర్వాత ఆగస్టు 25న గురు పుష్య యోగంలో అరుదైన యాదృచ్చికం..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News